Phone to MLA Please Resign: ఇటీవల ఎమ్మెల్యేలను ఫోన్ కాల్స్ బెడద పట్టుకుంది. రాజీనామా చేయాలంటూ పలువురు ఫోన్ చేస్తున్నారు. రిజైన్ చేస్తే తమ నియోజకర్గం అభివృద్ధి చెందుతుందని సామన్యులు ఎమ్మెల్యేలకు ఫోన్స్ చేస్తున్నారు. ఆ మధ్య మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి రామాయంపేటకు చెందిన వ్యక్తి ఫోన్ చేశాడు. మొదట మునుగోడులో ఏ పార్టీ గెలుస్తది అని అడిగి, తర్వాత తన మనసులోని మాట బయటపెట్టాడు. మీరు కూడా రాజీనామా చేస్తే మనకూ ఉప ఎన్నిక వస్తది.. మా కాట్రియాల విలేజ్ కూడా అభివృద్ధి చెందుతది అని కోరాడు.
Read Also: JR.NTR : జూనియర్ ఎన్టీఆర్ పై ప్రశంసల జల్లు.. సింప్లిసిటీకి ఫిదా అవుతున్న అభిమానులు
అక్టోబర్ 29న మెదక్ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి రామాయంపేటకు చెందిన ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. మొదట ‘‘అక్కా.. మునుగోడులో ఏ పార్టీ గెలుస్తది’’ అని అడిగి, తర్వాత తన మనసులోని మాట బయటపెట్టాడు. ‘‘మీరు కూడా రాజీనామా చేస్తే మనకూ ఉప ఎన్నిక వస్తది.. మా కాట్రియాల విలేజ్ కూడా డెవలప్ అయితది కదా అక్కా’’ అనడంతోనే ఎమ్మెల్యే ఫోన్ కట్‌చేశారు. అటు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కు ఆయా నియోజకవర్గాల్లోని ప్రజలనుంచి ఇలాంటి ఫోన్‌కాల్సే వచ్చాయి. ముందుగా మునుగోడు గురించి ఆరా తీసిన కాలర్స్.. ఆ తర్వాత మెల్లగా టాపిక్ మారుస్తున్నారు.
Read Also: Naveen Chandra: తగ్గేదే లే.. ఆమె కోసమే 38సార్లు సినిమా చూశా.. ఇంతలా ఆ హీరోకు నచ్చిన నటి ఎవరంటే ?
తాజాగా వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డికి కూడా రాజీనామా చేయాలంటూ ఫోన్ కాల్ వచ్చింది. పూడూరు మండలానికి చెందిన రాజు అనే వ్యక్తి ఎమ్మెల్యే మహేష్ రెడ్డికి ఫోన్ చేసి రాజీనామా చేయాలని కోరాడు. రేగడి మామిడి పల్లిలో సర్పంచ్ చందాలు సేకరించి రోడ్లు వేయించాడని….ఆ దుస్థితి మనకెందుకని ఎమ్మెల్యేను ప్రశ్నించాడు. రాజీనామా చేస్తే మునుగోడు వలే ఉప ఎన్నికలు వచ్చి పరిగి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నాడు. అయితే తాను ప్రస్తుతం మునుగోడు ఎన్నికల ప్రచారంలో ఉన్నానని…. బుధవారం ఇంటికి రా..వచ్చాక రాజీనామా చేద్దామంటూ రాజుకు ఎమ్మెల్యే మహేష్ రెడ్డి సమాధానమిచ్చాడు.