Macharla: ఏకాంతంగా ఉన్న జంటలే టార్గెట్.. వీడియోలతో ఏఎస్ఐ అరాచకాలు..!
- పల్నాడు జిల్లా మాచర్లలో ఏఎస్ఐ అరాచకాలు
- ఏకాంతంగా ఉన్న ప్రేమజంటలే ప్రధాన టార్గెట్
- ఆటో డ్రైవర్‌ను ఇన్ఫార్మర్‌గా ఉపయోగించిన ఏఎస్ఐ
- జంటల వీడియోలను రహస్యంగా చిత్రీకరించి బ్లాక్ మెయిల్
- వీడియోలు బయటపెడతామని బెదిరించి డబ్బులు వసూలు
- మహిళలను లైంగికంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Macharla: రక్షక భట నిలయాలే భక్షక నిలయాలుగా మారుతున్నాయా.? శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే కామపిశాచులుగా మారి అబలలపై పడుతున్నారా.? అంటే పల్నాడు జిల్లా మాచర్ల నుంచి వస్తున్న వార్తలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. మాచర్లలో ఒక ఏఎస్ఐ (ASI) సాగిస్తున్న దౌర్జన్యాలు, లైంగిక వేధింపుల ఉదంతం ఇప్పుడు స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.
Home Minister Vangalapudi Anitha: ఆపరేషన్ ట్రేస్‌లో 900 పిల్లలను రక్షించాం..
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
అందిన సమాచారం ప్రకారం.. మాచర్లకు చెందిన ఒక ఏఎస్ఐ, ఏకాంతంగా గడుపుతున్న ప్రేమికులను లక్ష్యంగా చేసుకున్నాడు. ఇందుకోసం జమ్మలమడకకు చెందిన ఒక ఆటో డ్రైవర్‌ను తన ఇన్ఫార్మర్‌గా నియమించుకున్నాడు. ఎక్కడైనా జంటలు ఏకాంతంగా కనిపిస్తే, సదరు ఆటో డ్రైవర్ ద్వారా వారిని రహస్యంగా వీడియోలు తీయిస్తున్నాడు. ఆ వీడియోలను అడ్డం పెట్టుకుని సదరు ఏఎస్ఐ తన అసలు స్వరూపాన్ని బయటపెడుతున్నాడు.
వారి ఏకాంత వీడియోలు చూపిస్తూ ఆ జంటలను భయభ్రాంతులకు గురిచేయడం ఈ కిలేడి ఏఎస్ఐకి పరిపాటిగా మారింది. వీడియోలు బయటపెడతామని, కేసు పెడతామని బెదిరించి బాధితుల నుంచి భారీగా నగదు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కేవలం డబ్బుతోనే ఆగకుండా, తన వికృత కోరిక తీర్చాలంటూ యువతులు, మహిళలను వేధిస్తున్నట్లు తెలుస్తోంది. వీడియోలను సాకుగా చూపి లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తున్న ఈ అధికారి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ అరాచకాల్లో సదరు ఏఎస్ఐ ఒక్కడే కాదు, మరో ఏఎస్ఐ మరియు ఒక కానిస్టేబుల్ కూడా భాగస్వాములుగా ఉన్నట్లు సమాచారం. వీరంతా ఇదే తరహాలో మహిళలను లోబర్చుకుంటూ, బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని బాధితులు వాపోతున్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే వేటగాళ్లుగా మారడంతో సామాన్య ప్రజలు భయం గుప్పిట్లో గడుపుతున్నారు.
తాజాగా అందిన సమాచారం మేరకు సదరు ఏఎస్ఐ శ్రీనివాస్ ను ఉన్నత అధికారులు సస్పెండ్ చేశారు.
తాజావార్తలు
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్‌కు బ్రేక్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!