Pallavi Prashanth vs Police: పోలీసులుపై రైతు బిడ్డ ఓవర్ యాక్షన్.. ఫ్యాన్స్ ను చితక్కొట్టి పంపేశారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pallavi Prashanth vs Police at Annapurna Studios: బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ ఎట్టకేలకు విజయవంతంగా పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. అమర దీప్ -పల్లవి ప్రశాంత్ ఇద్దరూ కప్ కోసం పోటీ పడగా చివరికి పల్లవి ప్రశాంత్ కప్ కొట్టాడు. ఇక షో ముగిసిన తర్వాత కంటెస్టెంట్లు తమ ఇంటికి వెళ్లే సమయంలో వీరిని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. ముఖ్యంగా అమర్‌దీప్ తన భార్య, తల్లితో కారులో బయటకు రాగానే ప్రశాంత్ అభిమానులు దాడి చేసి కారును చుట్టుముట్టి అద్దాలు పగలగొట్టారు. అలాగే కొందరు గీతూ రాయల్, అశ్విని శ్రీ కారు అద్దాలు సైతం ధ్వంసం చేయగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక అటువైపుగా వెళ్తున్న దాదాపు 6 బస్సుల అద్దాలపైన కూడా రాళ్లదాడి చేశారు. దీంతో పోలీసులు పరిస్థితులను అదుపులోకి తీసుకురావడం కోసం కంటెస్టెంట్లను అక్కడి నుంచి సురక్షితంగా తరలించేందుకు చర్యలు చేపట్టగా అది ప్రశాంత్ తో వాగ్వాదానికి కారణం అయింది.
SeshExShruti :అడివిశేష్, శృతిహాసన్ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్..?
Also Read
- Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
- PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
- Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
- Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
కప్ గెలిచిన ఆనందంలో ప్రశాంత్ రూఫ్ టాప్ కారులో నిలబడి ర్యాలీ చేయాలని అనుకున్నాడు. అయితే అతను అలా ర్యాలీ చేస్తే శాంతిభద్రతలకు ఇబ్బంది కలుగుతుందని భావించిన పోలీసులు అతడిని బయటకు రావొద్దని పదే పదే చెబుతూ కారు ఆపకుండా ముందుకు పోనివ్వాలని హెచ్చరించారు. దీంతో ప్రశాంత్ అసహనానికి లోనయ్యి ‘అన్నా.. ఏందన్నా ఇది! ఒక రైతుబిడ్డకు గింత విలువిస్తలేరు’ అని ఎప్పటి లాగే తనదైన శైలిలో రెచ్చిపోయి మాట్లాడాడు. ‘పోలీసులే ఇట్ల చేస్తే ఎలా అన్నా? ఒక రైతు బిడ్డ అన్నా, నా కోసం ఎంతమంది వచ్చిర్రన్నా..’ అంటూ బయటకు రానివ్వట్లేదని తల బాదుకుంటూ.. ఆ పోలీసులను వీడియో తీయమని కారులో ఉన్నవారికి ఆదేశాలు ఇవ్వడం కనిపిస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా రైతుబిడ్డ అనే సింపతీతో సీజనే గెలిచి ఇంకా ఆ రైతు బిడ్డ ముసుగు తీయకుండా ఎందుకు దాన్నే పట్టుకుని వేలాడతావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ప్రశాంత్ వెనుక వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న కొందరు అభిమానులను కొట్టి పంపేశారు అని ఆ వీడియోలో ప్రశాంత్ కారులోని వ్యక్తులు చెప్పడం కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
-
PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
ట్రెండింగ్
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!