Palla Rajeshwar Reddy: కడియం శ్రీహరి, కావ్య ఏక్కడ పోటీ చేసిన డిపాజిట్ రాకుండా చేస్తామని ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి కాంగ్రెస్ లోకి వెళ్ళే ఈ కుట్ర ఇవ్వాల్టిది కాదని, అసెంబ్లీ సమావేశంలోనే ఈ కుట్రకు బీజం పడిందన్నారు. మూడు నెలల క్రితమే ఈ కుట్రకు తెర లేసిందన్నారు. రేవంత్ రెడ్డి, కడియం శ్రీహరి భుజం పైనా చేతులు వేసి అసెంబ్లీలోకి తీసుకెళ్ళి సీటు ఆఫర్ చేశాడని.. ఇది కడియం శ్రీహరి నే చెప్పాడని క్లారిటీ ఇచ్చారు. కుట్రతోనే బీఆర్ఎస్ లోనే నాయకుల వెళ్ళ గొట్టి బిడ్డకు టికెట్ ఇప్పించుకున్నాడన్నారు. కడియం శ్రీహరి ఎన్నికల కుట్రలు పన్నాడో మాకు అందరికీ తెలుసన్నారు.
Read also: Kumari Aunty : చదువుపై కుమారి ఆంటీ ఎమోషనల్ స్పీచ్.. ఫిదా అవ్వాల్సిందే.
మా కార్యకర్తలను ఇప్పుడు వేధిస్తున్నాడని తెలిపారు. కడియం శ్రీహరి దేనికి బ్రాండ్? ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిన తీరుకు బ్రాండా? అని ప్రశ్నించారు. లేని లింగం పల్లి రిజర్వాయర్ నిర్మాణం పేరుతో కంట్రాక్టర్లను బెదిరించి.. ఇంటిని నిర్మాణం చేసుకున్న ఘనుడు కడియం శ్రీహరి అన్నారు. భూములు ఎలా కబ్జా చేసివో ఘనపూర్ కార్యకర్తలకు అందరికీ తెలుసన్నారు. స్టేషన్ ఘనపూర్ కార్యకర్తలకు అండగా ఉంటా అన్నారు. సీటు రాకపోవడంతో పసునూరి ఆరురి వెళ్లారని తెలిపారు. కానీ ఎంఎల్ఏ గా గెలిపించుకున్న తర్వాత కడియం శ్రీహరి మోసం చేసి వెళ్ళాడు కాబట్టి మోసగాడు అంటున్నామన్నారు. కడియం శ్రీహరి పార్టీ మారే కుట్ర మూడు నెలల నుండి జరుగుతుందన్నారు. కడియం శ్రీహరి మూడు నెలల నుండి కుట్ర పన్నాడన్నారు.
Read also: Babu Mohan: బీజేపీ పార్టీ టికెట్ ఇస్తానని ఇవ్వలేదు.. బాబుమోహన్ కీలక వ్యాఖ్యలు..
ఆరూరి రమేష్, పసునూరి దయాకర్ ను కడియం శ్రీహరే ఏల్లగొట్టాడన్నారు. ఘన్పూర్ ప్రజలకు నేను అందుబాటులో ఉంటూ.. అండగా ఉంటా అన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ కు వెన్నుపోటు పోడిసిన వ్యక్తి కడియం శ్రీహరి అన్నారు. కావ్య మా నాన్న బ్రాండ్ అంటుందన్నారు. వెన్నుపోటు పొడవడంలో బ్రండా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియం లాంటి ద్రోహులను ప్రజలు క్షమించరని తెలిపారు. కడియం… సిగ్గు, శరం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యి అంటూ అన్నారు. కడియం శ్రీహరి, కావ్య ఏక్కడ పోటీ చేసిన డిపాజిట్ రాకుండా చేస్తామమన్నారు. ఘన్పూర్ ప్రజలకు ఏ పనైనా నేను సేవా చేస్తా అన్నారు.
Chada Venkata Reddy: ఫిరాయింపులతో రాజకీయ వ్యవస్థ బూజు పడుతుంది..!