India Armenia: భారత స్వదేశీ ఆయుధాల ముందు చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, చైనీస్ మిస్సైల్స్, టర్కీ డ్రోన్లు నిలవలేవనే విషయం ‘‘ఆపరేషన్ సిందూర్’’ ద్వారా ప్రపంచం చూసింది. పాకిస్తాన్ వినియోగించిన టర్కీ, చైనా రక్షణ ఆయుధాలు, వ్యవస్థల్ని భారత్ తుక్కుతుక్కు చేసింది. భారత్ పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసి వైమానిక రక్షణ వ్యవస్థ అత్యంత సమర్థవంతంగా పనిచేసింది. ‘‘ఆకాష్’’ సర్ఫేజ్ టూ ఎయిర్ మిస్సైల్స్ అత్యంత ఖచ్చితత్వంలో పాక్ వైమానికి ముప్పుని అడ్డుకున్నాయి. వీటిలో పాటు బ్రహ్మోస్ మిస్సైల్స్ పాకిస్తాన్‌లోని 11 వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాయి.
ఇదిలా ఉంటే, తాజాగా భారత్ తన ఆయుధాలను ఆర్మేనియాకు ఎగుమతి చేయబోతోంది. ఏకంగా 1 బిలియన్ డాలర్ల ఒప్పందం ఇరు దేశాల మధ్య కుదిరే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆకాష్-1Sను ఆర్మేనియాకు సరఫరా చేయబోతోంది. ఈ ఒప్పందంపై 2022లోనే ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఇప్పటికే భారత్ ఆర్మేనియాకు హోవిట్జర్ తొపాకులు, యాంటీ ట్యాంక్ రాకెట్లు, యాంటీ డ్రోన్ పరికరాలను ఇచ్చింది. పినాకా మల్టీపుల్ రాకెట్ లాంచింగ్ సిస్టమ్, ZADS కౌంటర్-డ్రోన్ వ్యవస్థ ఒప్పందంలో భాగంగా ఉన్నాయి.
2020లో భారతదేశంతో రక్షణ ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత, 2022లో $720 మిలియన్లకు 15 ఆకాశ్ క్షిపణి వ్యవస్థల కోసం ఆర్డర్ ఇచ్చింది, ఈ వ్యవస్థ యొక్క మొదటి విదేశీ కొనుగోలుదారుగా ఆర్మేనియా అవతరించింది. ఈ వ్యవస్థ ఫైటర్ జెట్స్, గైడెడ్ మిస్సైల్స్, డ్రోన్లను అడ్డుకుంటుంది. భారత్‌తో ఆర్మేనియా బంధం ఇలాగే కొనసాగితే రక్షణ ఉత్పత్తుల్లో ఎగుమతి చేసే రష్యాను దాటే అవకాశం ఉంది.
రష్యా 2011 నుండి ఆర్మేనియాకు అతిపెద్ద ఆయుధ సరఫరాదారు 2020. స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) ప్రకారం, రష్యా 2016లో 300 కిలోమీటర్ల అంచనా పరిధి కలిగిన అర్మేనియా ఇస్కాండర్ స్వల్ప-శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను మరియు 2019లో నాలుగు Su-30SM యుద్ధ విమానాలను విక్రయించింది. అయితే, ఉక్రెయిన్ యుద్ధం వల్ల రష్యా ఆర్మేనియాకు మరిన్ని ఆయుధాలు ఇవ్వలేకపోయింది.
Read Also: Donald Trump: “నాకు సరైన క్రెడిట్ ఇవ్వలేదు..” కాల్పుల విరమణపై మరోసారి స్పందించిన ట్రంప్
పాక్ మిత్రులకు మూడినట్లే..
భారత్‌పై దాడి విషయంలో టర్కీతో పాటు అజర్‌బైజాన్ దేశాలు పాకిస్తాన్‌కి తమ సంపూర్ణ మద్దతు తెలిపాయి. అయితే, టర్కీ, అజర్ బైజాన్‌తో ఆర్మేనియాకు ఎప్పటి నుంచో శత్రుత్వం ఉంది. దీంతో భారత్-ఆర్మేనియా బంధం బలపడుతోంది. తాజా ఆపరేషన్ సిందూర్ భారత క్షిపణుల పనితనాన్ని ప్రపంచం మొత్తం గమనించింది.
2020లో ఆర్మేనియా-అజర్ బైజాన్ మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో అజర్ బైజాన్‌కి టర్కీ మద్దతుగా నిలిచింది. నాగర్నో-కారాబాఖ్ కోసం జరిగిన ఈ యుద్ధంలో బలమైన ఆర్మేనియా సైన్యాన్ని, టర్కీ డ్రోన్లు ఉపయోగించి అజర్ బైజాన్ ఓడించింది. ఆ సమయంలో పాకిస్తాన్ అజర్ బైజాన్‌కి మద్దతు ఇచ్చింది. పాకిస్తాన్ దళాలు కరాబాఖ్‌లో అజర్‌బైజాన్ సైన్యంతో కలిసి పనిచేస్తున్నాయని ఆర్మేనియా ప్రధాని నికోల్ పషిన్యన్ ఆరోపించారు.
2017లో నాగర్నో కారాబాఖ్ వివాదం చెలరేగిన తర్వాత పాకిస్తాన్ , టర్కీ, అజర్ బైజాన్ త్రైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేశాయి. 2020 యుద్ధంలో అజర్ బైజాన్‌కి పూర్తి మద్దతు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో భారత్ తన క్షిపణుల్ని, కీలక ఆయుధాలను ఆర్మేనియాకు విక్రయించడం ఇప్పుడు టర్కీ, పాకిస్తాన్‌కి భయాన్ని కలిగిస్తోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో టర్కీ డ్రోన్లను మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పిట్టల్లా కూల్చేసింది. ఈ ఫలితాలు ఆర్మేనియాకు మరింత ధైర్యాన్ని ఇచ్చాయి.