Pakistan: పాకిస్థాన్‌లో 2024 నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధించారు. గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ పాలస్తీనాకు మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో గాజా ప్రజలకు సంఘీభావంగా ఈ సారి నూతన సంవత్సర వేడుకలను చేసుకోకూడదని పాకిస్థాన్ నిర్ణయించింది. ఈ మేరకు కొత్త సంవత్సర వేడుకలకు సంబంధించి అన్ని రకాల కార్యక్రమాలను పూర్తిగా నిషేధించామని పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధాని అన్వరుల్ హక్ కాకర్ పేర్కొన్నారు.
Read Also: MEA on Qatar: న్యాయబృందంతో చర్చిస్తాం.. ఖతార్ అంశంపై ప్రభుత్వ తొలి స్పందన ఇదే..
పాక్ ప్రధాని ఒక వీడియో సందేశంలో గాజా, వెస్ట్‌బ్యాంక్‌లో అణచివేయబడిన పాలస్తీనియన్ల మారణహోమం, ముఖ్యంగా అమాయక పిల్లల ఊచకోత పట్ల పాక్ ప్రధాని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “అక్టోబర్ 7, 2023 నుంచి క్రూరమైన ఇజ్రాయెల్ దళాలచే 21,000 మందికి పైగా అమాయక పాలస్తీనియన్లు అమరవీరులయ్యారు, ఇందులో దాదాపు 9000 మంది అమాయక పిల్లలు ఉన్నారు.” అని కాకర్ చెప్పినట్లు డాన్ పేర్కొంది. గాజా ప్రజలకు సంఘీభావం తెలపాలని, నూతన సంవత్సరం ప్రారంభంలో సరళతను పాటించాలని కాకర్ పాకిస్తానీ ప్రజలను కోరారు.
Read Also: Historic Peace Deal: కేంద్రం, ఉల్ఫా మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం.. అమిత్ షా సమక్షంలో సంతకం
ఈ ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ తీవ్రవాద దాడిని, ఇజ్రాయెల్ పౌరులను అపహరించినందుకు పాకిస్తాన్ పాలస్తీనా వాదానికి అతిపెద్ద మద్దతుదారుల్లో ఒకటిగా ఉంది. యుద్ధంతో సతమతమవుతున్న పాలస్తీనాకు ఇప్పటికే తాము రెండుసార్లు మానవతా సాయం అందించామని, త్వరలోనే మరో విడత పంపిస్తామని తెలిపారు. పాలస్తీనియన్ ప్రజలకు సహాయం చేయడానికి ప్రభుత్వం రెండు సార్లు మానవతా సాయం అందించిందని, త్వరలోనే మరో విడత సాయం పంపబడుతుందని పాక్ ఆపద్ధర్మ ప్రధాని తెలిపారు. అదేవిధంగా, పాలస్తీనియన్లకు సకాలంలో ఉపశమనం కలిగించడం, గాజా నుంచి గాయపడిన వారిని తరలించడం, వారి చికిత్స కోసం పాకిస్తాన్ ప్రభుత్వం ఈజిప్ట్, జోర్డాన్‌లతో సన్నిహితంగా ఉందని ఆయన అన్నారు.