పాకిస్థాన్‌లో 2024 నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధించారు. గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ పాలస్తీనాకు మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో గాజా ప్రజలకు సంఘీభావంగా ఈ సారి నూతన సంవత్సర వేడుకలను చేసుకోకూడదని పాకిస్థాన్ నిర్ణయించింది.
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రతిపక్షాలు పెట్టిన పరీక్షలో ఓడిపోయారు. జాతీయ అసెంబ్లీ విశ్వాసం సొందటంలో ఆయన విఫలమయ్యారు. శనివారం అర్ధరాత్రి అవిశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో విపక్షాలు విజయం సాధించాయి. దాంతో ఇమ్రాన్ తన పదవిని కోల్పోయారు. దేశ చరిత్రలోనే అవిశ్వాస తీర్మానం ద్వారా అధికారం నుంచి వైదొలిగిన తొలి ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ నిలిచారు. పదవిని కాపాడుకనేందుకు చివరి వరకు పోరాడిన ఆయనకు ఓటమి తప్పలేదు. దాంతో పాకిస్తాన్ 75 ఏళ్ల చరిత్రలో ఇప్పటి…
పాకిస్తాన్‌లో ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా జనం పెద్ద ఎత్తున రోడ్లెక్కి నిరసనకు దిగుతుండడంతో శాంతిభద్రతల సమస్య తలెత్తుతోంది. తన విధానాలతో దేశాన్ని సర్వనాశనం చేస్తున్న ఇమ్రాన్ వెంటనే గద్దె దిగాలని ఆందోళన కారులు డిమాండ్ చేస్తున్నారు. పాకిస్తాన్‌తో నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోవడంతో సామాన్యులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రోజురోజుకీ పెరుగుతున్న ధరలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రతిపక్షాలు, కార్మికులు, ప్రజలు వేలాది మంది కరాచీలో రోడ్లపైకి వచ్చి ర్యాలీలు చేస్తున్నారు. ప్రధాని తక్షణమే రాజీనామా చేయాలని…