Site icon NTV Telugu

Cease Fire Violation : భారత్‌లోకి చొరబడేందుకు పాక్ యత్నం.. తిప్పికొట్టిన సైన్యం!

Border

Border

సరిహద్దుల్లో నగ్రోటా వద్ద చొరబాటుకు పాక్ యత్నించింది. పాక్ చొరబాటుదారులపై భారత రక్షణ దళం కాల్పులు జరిపింది. చొరబాటు దారులు సైతం కాల్పులు జరపగా.. ఓ ఇండియన్ ఆర్మీ జవాను గాయపడ్డారు. ప్రస్తుతం రక్షణా దళాలు చొరబాటుదారుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఈ విషయాన్ని భారత సైన్యం వైట్ నైట్ కార్ప్స్ ట్వీట్ ద్వారా తెలియజేసింది.

READ MORE: Ajit Doval: పాక్- భారత్ వివాదం.. అజిత్ దోవల్‌తో మాట్లాడిన చైనా విదేశాంగ మంత్రి!

ఎల్‌వోసీ దగ్గర అనుమానాస్పద కార్యకలాపాలను గమనించిన, నగ్రోటా మిలిటరీ స్టేషన్ అప్రమత్తంది. సరిహద్దు దాటి చొరబాటుకు యత్నిస్తున్న వారిని భారత సెంట్రీ గుర్తించారు. దీని తరువాత, అనుమానితుడితో కొద్దిసేపు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో సెంట్రీకి స్వల్ప గాయాలయ్యాయి. ఈ హఠాత్ పరిణామంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. చొరబాటుదారులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

READ MORE: Virender Sehwag: ‘కుక్క తోకర వంకర’.. పాక్‌ దాడిపై సెహ్వాగ్ సంచలన ట్వీట్

కాగా.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి, జమ్మూ కశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో పాకిస్థాన్ మళ్లీ షెల్లింగ్ ప్రారంభించింది. నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) సమీపంలోని రాజౌరి, అఖ్నూర్, సాంబా పట్టణాలపై ఇది కాల్పులు జరిపింది. ఇది కాకుండా, శ్రీనగర్, ఉధంపూర్, జమ్మూలలో కూడా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అన్ని ప్రాంతాలలో కొన్ని గంటలు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శ్రీనగర్‌లో 20 నిమిషాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని చెబుతున్నారు. పాకిస్థాన్ కాల్పుల విరమణ ఉల్లంఘన ప్రకటించినప్పటి నుంచి నాలుగు గంటలు కూడా గడవకముందే ఈ ఘటన జరిగింది.

READ MORE: China: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత.. చైనా విదేశాంగ మంత్రి కీలక ప్రకటన..

Exit mobile version