సరిహద్దుల్లో నగ్రోటా వద్ద చొరబాటుకు పాక్ యత్నించింది. పాక్ చొరబాటుదారులపై భారత రక్షణ దళం కాల్పులు జరిపింది. చొరబాటు దారులు సైతం కాల్పులు జరపగా.. ఓ ఇండియన్ ఆర్మీ జవాను గాయపడ్డారు. ప్రస్తుతం రక్షణా దళాలు చొరబాటుదారుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఈ విషయాన్ని భారత సైన్యం వైట్ నైట్ కార్ప్స్ ట్వీట్ ద్వారా తెలియజేసింది.
ED Raids: ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారం ఓ కీలక చర్య చేపట్టింది. ఢిల్లీ, ఎన్‌సిఆర్ లోని 15 వేర్వేరు ప్రదేశాలలో డిపార్ట్మెంట్ దాడులు చేసింది. షెల్ కంపెనీపై ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) భారీ చర్యలు తీసుకుంది. గతంలోని క్వాలిటీ లిమిటెడ్ కంపెనీకి చెందిన అప్పటి డైరెక్టర్‌కు చెందిన 15 స్థానాలపై ఈడీ దాడులు చేసి రూ. 1.3 కోట్ల విలువైన నగదును, అనేక నేరారోపణ పత్రాలను స్వాధీనం చేసుకుంది. అలాగే డీమ్యాట్ ఖాతాలో ఉన్న…