NTV Telugu Site icon

Sehar Shinwari: బంగ్లా ఆటగాళ్లకు పాక్ నటి బంపర్ ఆఫర్.. భారత్ను ఓడిస్తే!

Pak Acter

Pak Acter

Sehar Shinwari: వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా-పాకిస్తాన్ మధ్య అహ్మదాబాద్ లో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పాక్ ను టీమిండియా చిత్తుగా ఓడించింది. పాకిస్థాన్‌పై టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఓటమి నుంచి పాకిస్థానీలు ఇంకా తేరుకోవడం లేదు. మరోవైపు రేపు పూణేలో ఇండియా-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో బంగ్లా ఆటగాళ్లకు పాకిస్తాన్ కు చెందిన నటి సెహర్ షిన్వారీ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. భారత్‌పై బంగ్లాదేశ్ ప్రతీకారం తీర్చుకోవాలని తెలిపింది. టీమిండియాను ఓడిస్తే, తాను ఢాకా వెళ్లి ఒక క్రికెటర్ తో డేట్ చేస్తానని చెప్పింది. మరోవైపు ఈ టోర్నీలో టీమిండియాతో పాకిస్తాన్ మరోసారి తలపడాలంటే.. ఆ జట్టు సెమీస్ కు చేరాలి.

Read Also: France: ఫ్రాన్స్‌లో దాడుల కలకలం.. 6 ఎయిర్‌పోర్టుల్లో ఎమర్జెన్సీ..

ప్రపంచకప్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. టోర్నీలో ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్ గెలవగా.. చెన్నైలో మెన్ ఇన్ బ్లూ 6 వికెట్ల తేడాతో కంగారూ జట్టును ఓడించింది. ఆ తర్వాత ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్థాన్‌పై విజయం సాధించింది. ఆ తర్వాత అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మూడో మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది.

Read Also: Supreme Court Collegium: 13 మంది న్యాయవాదుల పేర్లను హైకోర్టు న్యాయమూర్తులుగా సిఫార్సు

ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ భారత్ పరుగుల ఛేజింగ్‌లో విజయం సాధించడం గమనార్హం. ఆ తర్వాత బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌తో తదుపరి మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.