NTV Telugu Site icon

PAK vs ZIM: 10 వికెట్ల తేడాతో జింబాబ్వేపై పాక్ గెలుపు.. సిరీస్ కైవసం

Pak Vs Zim

Pak Vs Zim

సుఫియాన్ ముకీమ్ డేంజరస్ బౌలింగ్‌తో జింబాబ్వే జట్టును మట్టి కరిపించాడు. రెండో టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లు పాక్ గెలుపొందింది. దీంతో.. పాకిస్తాన్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. అజేయంగా 2-0 ఆధిక్యాన్ని కూడా సాధించింది. సల్మాన్ అగా సారథ్యంలో పాకిస్థాన్ తొలిసారి టీ20 సిరీస్‌ను గెలుచుకుంది.

Read Also: Minister Nimmala Ramanaidu: మరోసారి పోలవరం పర్యటనకు సీఎం.. ప్రాజెక్టు నిర్మాణ షెడ్యూల్‌ ప్రకటన..!

ఈ మ్యాచ్‌లో జింబాబ్వే టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో..12.5 ఓవర్లలో 57 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ అత్యధికంగా 21 పరుగులు చేశాడు. టి మారుమణి 16 పరుగులు చేశాడు. వీరిద్దరూ మినహా జట్టులోని 9 మంది బ్యాట్స్‌మెన్లు రెండంకెల స్కోరును అందుకోలేకపోయారు. పాకిస్థాన్ తరఫున సుఫియాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి 2.4 ఓవర్లలో 3 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. అబ్బాస్ అఫ్రిది రెండు వికెట్లు, అబ్రార్ అహ్మద్, కెప్టెన్ సల్మాన్ అఘా ఒక్కో వికెట్ తీశారు.

Read Also: Fastest Centuries In T20: టి20లలో అత్యంత వేగవంతమైన సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్స్ వీరే

58 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు 5.3 ఓవర్లలో 61 పరుగులు చేసి 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాకిస్థాన్ ఓపెనర్ బ్యాట్స్‌మెన్ ఒమైర్ యూసుఫ్ అజేయంగా 22 పరుగులు చేయగా.. సైమ్ అయూబ్ 18 బంతుల్లో అజేయంగా 36 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో సుఫియాన్ ముఖీమ్ తన అద్భుతమైన బౌలింగ్‌తో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 5 వికెట్లు తీసిన పాకిస్థాన్‌ నుంచి మూడో బౌలర్‌గా సుఫియాన్ నిలిచాడు.

Show comments