Site icon NTV Telugu

Cease Fire Violation: మారని పాకిస్థాన్ బుద్ది.. భారత్‌పై మళ్లీ దాడులు?

War

War

భారత్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే పాకిస్థాన్ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని అఖ్నూర్, రాజౌరి, ఆర్‌ఎస్ పురా సెక్టార్‌ల నుంచి ఫిరంగి దాడులు జరిగినట్లు సమాచారం. జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరి సెక్టార్‌లో పాకిస్థాన్ డ్రోన్ కలకలం సృష్టించింది. ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లాలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అప్రమత్తమైన భారత భద్రతా దళాలు ఒక డ్రోన్‌ను కూల్చివేశాయి. జమ్మూలోని పలన్వాలా సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి పాకిస్థాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది. శ్రీనగర్‌లో కాల్పుల శబ్దాలు వినిపిస్తునట్లు జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. శ్రీనగర్‌లో 4-5 చోట్ల పేలుళ్ల శబ్దాలు వినిపించాయన్నారు.. శ్రీనగర్‌, పఠాన్ కోట్‌లో మళ్లీ బ్లాకౌట్స్ ప్రకటించారు. మరోవైపు.. రాజస్థాన్ దారిహద్దుల్లో బర్మేయర్, జైసల్మేర్‌లో బ్లాకౌట్ ప్రకటించారు.. రెండు నగరాల్లోనూ విద్యుత్ సరఫరా నిలిపివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు బ్లాకౌట్ పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ.. ఈ దాడులపై భారత ప్రభుత్వం, భద్రతా దళాల నుంచి ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు.

READ MORE: Ram Charan : మేడమ్ టుస్సాడ్స్ లో మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించిన చరణ్‌

కొన్ని రోజులుగా భారత్, పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు తెరపడిందనుకునే లోపే ఈ వార్త వచ్చింది. కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ఇరుదేశాల విదేశాంగ శాఖలు ప్రకటించాయి. అయితే, ఈ ప్రకటన అనంతరం పాక్ మళ్లీ దుశ్చర్య ప్రారంభించింది. భారత సైన్యం సైతం ధీటుగా స్పందిస్తోంది. భారత సైన్యం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని.. ఇప్పటికే ఇండియన్ ఆర్మీ స్పష్టం చేసింది.

READ MORE: Retired out: ఇదేందయ్యా ఇది.. జట్టులోని పదిమంది రిటైర్డ్ అవుట్.. ఎందుకంటే.?

Exit mobile version