భారత్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని అఖ్నూర్, రాజౌరి, ఆర్‌ఎస్ పురా సెక్టార్‌ల నుంచి ఫిరంగి దాడులు జరిగినట్లు సమాచారం. జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరి సెక్టార్‌లో పాకిస్థాన్ డ్రోన్ కలకలం సృష్టించింది. ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లాలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. భద్రతా దళాలు ఒక డ్రోన్‌ను కూల్చివేశాయి. జమ్మూలోని పలన్వాలా సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి పాకిస్థాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది.