NTV Telugu Site icon

Asia Cup 2023: పాక్‌లో నాలుగు, మిగిలినవన్నీ శ్రీలంకలోనే.. ఆసియా కప్‌ షెడ్యూల్‌ ఇదే..

Asia Cup

Asia Cup

Asia Cup 2023: ఆసియా కప్‌ షెడ్యూల్‌ వచ్చేసింది. ఆగస్టు 31న ప్రారంభం కానున్న ఆసియా కప్ 2023 టోర్నీని సెప్టెంబర్‌ 17 వరకు నిర్వహించనున్నట్లు ఏషియన్‌ క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) పేర్కొంది. సెప్టెంబర్‌ 17న ఫైనల్‌ మ్యాచ్ జరగనుంది. మొత్తం 13 మ్యాచ్‌ల్లో నాలుగు పాకిస్థాన్‌లో, 9 మ్యాచ్‌లు శ్రీలంకలో జరగనున్నట్లు ఏసీసీ వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం 2023 ఆసియా కప్‌కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే పాకిస్తాన్‌లో పర్యటించేందుకు టీమిండియా సుముఖత వ్యక్తం చేయకపోవడంతో యూఏఈలో, ఇంగ్లాండ్‌లో కూడా ఆసియా కప్ 2023 టోర్నీ నిర్వహించబోతున్నారని ప్రచారం జరిగింది. ఎట్టకేలకు ఆసియా కప్ 2023 షెడ్యూల్‌పై ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నుంచి అధికారిక ప్రకటన వచ్చిది.

Also Read: OTT Releases: ఈ వారం ఓటీటీల్లో సందడి చేసే సినిమాలు ఇవే!

ఆగస్టు 31న ప్రారంభమయ్యే ఆసియా కప్ 2023 టోర్నీ, సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్‌తో పాటు ఆసియా కప్‌లో ఈసారి నేపాల్ కూడా మొట్టమొదటిసారిగా ఆడబోతోంది. మొత్తంగా 13 మ్యాచుల ఈ టోర్నీని హైబ్రీడ్ మోడల్‌లో నిర్వహించబోతున్నట్టు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. నాలుగు మ్యాచులు పాకిస్తాన్‌లో జరుగబోతుంటే, మిగిలిన మ్యాచులన్నీ శ్రీలంక వేదికగా జరుగుతాయి.. ఆసియా కప్ 2023 ఎడిషన్‌లో మూడేసి జట్లుగా రెండు గ్రూప్‌లుగా మొదటి రౌండ్ మ్యాచులు జరుగుతాయి. ఆ తర్వాత సూపర్ 4 రౌండ్‌లో టాప్‌లో నిలిచిన రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

Show comments