Site icon NTV Telugu

Indo-Pak: బార్డర్‌లో పాక్‌ ఆర్మీ విచక్షణారహిత కాల్పులు.. 15 మంది భారతీయ పౌరులు మృతి!

Pak Army

Pak Army

భారత్-పాక్‌ సరిహద్దులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. జమ్ముకశ్మీర్‌ లోని ఎల్‌వొసి వెంట పాక్‌ సైన్యం కాల్పులు జరుపుతోంది. పహల్గాం దాడి అనంతరం భారత్ ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో మెరుపు దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం పాక్ ఆర్మీ విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 15 మంది భారత పౌరులు మృతి చెందారు. 43 మందికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని భారత ఆర్మీ ధృవీకరించి వివరాలు వెల్లడించింది. వెల్లడించింది.

READ MORE: Bomb Threat: నరేంద్ర మోడీ స్టేడియాన్ని పేల్చేస్తాం.. పాకిస్థాన్‌ పేరుతో మెయిల్

కాగా.. ఉగ్రస్థావరాలపై భారత్‌ మెరుపు దాడిలో జరిపిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌లో 4, పీఓకేలో 5 ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులు జరిగాయి. ఈ ఆపరేషన్‌ సిందూర్‌లో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. 42 మంది మృతదేహాలను గుర్తించినట్లు సమాచారం.. గాయపడిన ఉగ్రవాదులకు పాక్ ఆర్మీ వైద్య చికిత్స అందిస్తోంది. మరోవైపు.. శత్రుదేశం దాడులు చేస్తే సురక్షితంగా ప్రాణాలు కాపాడుకోవడంపై అవగాహన కల్పించేందుకు సివిల్‌ డిఫెన్స్‌ మాక్‌ డ్రిల్స్‌ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా దాదాపు 300 ప్రాంతాలను ఎంపిక చేశారు. వైమానిక దాడులు, బాంబు దాడులు జరిగితే ఎలా రక్షించుకోవాలో ప్రజలు, విద్యార్థులకు తెలియజేయనున్నారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర మార్గదర్శకాలను అనుసరించి ఈ డ్రిల్స్‌ చేపడుతున్నారు.

READ MORE: YS Jagan: పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలి.. బ్రహ్మాండంగా ప్లీనరీని నిర్వహిద్దాం!

Exit mobile version