Indian Army: భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు క్షణక్షణానికి పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యం ఆక్రమిత కశ్మీర్ సరిహద్దుల వెంట డ్రోన్‌లు, మిసైళ్ల ద్వారా విస్తృతంగా దాడులు చేసేందుకు యత్నించింది. అయితే భారత భద్రతా బలగాలు సకాలంలో అప్రమత్తమై ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఈ దాడులకు ప్రతిగా భారత సైన్యం ఎల్ఓసీ (Line of Control) వెంట పాకిస్తాన్ మిలిటరీ పోస్టులపై ధాటిగా ప్రతీకార దాడులు నిర్వహించింది. Read Also: JD Vance…
భారత్-పాక్ సరిహద్దులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. జమ్ముకశ్మీర్ లోని ఎల్‌వొసి వెంట పాక్ సైన్యం కాల్పులు జరుపుతోంది. పహల్గాం దాడి అనంతరం భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో మెరుపు దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం పాక్ ఆర్మీ విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 15 మంది భారత పౌరులు మృతి చెందారు. 43 మందికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని భారత ఆర్మీ ధృవీకరించి వివరాలు వెల్లడించింది. వెల్లడించింది.