Operation Sindhoor: ఏప్రిల్ 22న పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పడానికి భారత్ ఆపరేషన్ సింధూర్‌ను ప్రారంభించింది. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా భారత్ మే 7 ఉదయం, పాకిస్థాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఇందులో 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు. ఆపరేషన్ సింధూర్ ప్రారంభంతో ఇరుదేశాల మధ్య ప్రారంభమైన వివాదం దాదాపు 4 రోజుల పాటు కొనసాగి మే…
భారత్-పాక్ సరిహద్దులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. జమ్ముకశ్మీర్ లోని ఎల్‌వొసి వెంట పాక్ సైన్యం కాల్పులు జరుపుతోంది. పహల్గాం దాడి అనంతరం భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో మెరుపు దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం పాక్ ఆర్మీ విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 15 మంది భారత పౌరులు మృతి చెందారు. 43 మందికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని భారత ఆర్మీ ధృవీకరించి వివరాలు వెల్లడించింది. వెల్లడించింది.