T20 World Cup: సెమీస్ రేస్‌లో ట్విస్ట్.. పాకిస్థాన్ ఆశలు చెరిపేసిన న్యూజిలాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup: పాకిస్థాన్‌కు మరో చిక్కు వచ్చి పడింది. సెమీ ఫైనల్ ఆశలు రోజు రోజుకీ క్షీణిస్తున్నాయి. నిన్న(బుధవారం) శ్రీలంకపై న్యూజిలాండ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి పాక్ ఆశలు సన్నగిల్లాయి. ఆ మ్యాచ్‌లో మిచెల్ సాంట్నర్ బ్యాటింగ్‌తో మెరిపించగా, రచిన్ రవీంద్ర బౌలింగ్ (4/27)లో చెలరేగి కివీస్‌కు 61 పరుగుల భారీ విజయాన్ని అందించాడు. అయితే.. గ్రూప్ 2 పట్టికలో ఇప్పటికే ఇంగ్లండ్ జట్టు రెండు మ్యాచుల్లో నాలుగు పాయింట్లతో సెమీఫైనల్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. మరోవైపు.. న్యూజిలాండ్ మూడు పాయింట్లతో రెండో స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం పాకిస్థాన్ మూడో స్థానానికి పడిపోయింది. శ్రీలంక ఇప్పటికే టోర్నీ నుంచి ఔట్ అయ్యింది. ఇక్కడ నెట్ రన్‌రేట్ విషయంలోనూ కివీస్ భారీ ఆధిక్యంలో ఉండటం పాకిస్థాన్‌కు పెద్ద మైనస్‌గా మారింది.
READ MORE: Off The Record : నరసన్నపేట పొలిటికల్ స్క్రీన్‌పై మారుతున్న సీన్స్..
Also Read
- Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
ఇప్పుడు పాకిస్థాన్ పరిస్థితి పూర్తిగా ఇతర మ్యాచ్ ఫలితాలపై ఆధారపడింది. ఫిబ్రవరి 28న శ్రీలంకతో జరిగే తమ చివరి మ్యాచ్‌ను తప్పనిసరిగా భారీ తేడాతో గెలవాలి. ఎంత భారీ విజయం సాధించినా ఇంకా సరిపోదు. ఒక రోజు ముందు జరిగే న్యూజిలాండ్-ఇంగ్లాండ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చాలా పెద్ద మార్జిన్‌తో విజయం సాధించాల్సి ఉంటుంది. అలా జరిగితేనే రెండు జట్లు మూడు పాయింట్లతో సమంగా నిలుస్తాయి. ఆ తర్వాత నెట్ రన్‌రేట్ సమీకరణలు కీలకం అవుతాయి. మరోవైపు.. పాకిస్థాన్ శ్రీలంక చేతిలో ఓడిపోతే ఇంటికి పెట్టే బేడ సర్దుకుని వెళ్లాల్సిందే. న్యూజిలాండ్ ఇంగ్లాండ్‌పై గెలిస్తే పాకిస్థాన్ మ్యాచ్ ఆడకముందే ఎలిమినేట్ అవుతుంది. ఒకవేళ ఆ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయినా పాకిస్థాన్ గెలిచినా ఉపయోగం ఉండదు. ఈ సమీకరణాలు చూస్తుంటే.. పాకిస్థాన్‌కు ‘డూ ఆర్ డై’ పరిస్థితి తప్పడం లేదు.
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!