NTV Telugu Site icon

PAK Replacement CWC 2023: ప్రపంచకప్ 2023లో పాకిస్థాన్ ఆడకుంటే.. ఆ జట్టుకు అవకాశం!

Pak Odi

Pak Odi

Here Is The Scenario If Pakistan Don’t Travel To India For 2023 World Cup: భారత గడ్డపై జరిగే ప్రపంచకప్ 2023 టోర్నీకి పాకిస్థాన్ వస్తుందా? లేదా? అనే సందిగ్థత ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రపంచకప్ 2023కి సంబంధించిన షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో పాకిస్థాన్ జట్టు భారత్‌కి వస్తుందని ఐసీసీ కూడా భావిస్తోంది. అయితే తాము భారత్‌కు వచ్చి ప్రపంచకప్ ఆడాలో వద్దో అనే విషయం పాకిస్థాన్ ప్రభుత్వమే నిర్ణయిస్తుందని పీసీబీ అంటుంది. దాంతో అందరూ మెగా టోర్నీలో పాక్ ఆడుతుందా లేదా అని ఆసక్తిగా చుస్తున్నారు. ఒక వేళ భారత గడ్డపైకి పాకిస్థాన్ రాకపోతే ఏం జరుగుతుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

భారత గడ్డపై తాము ప్రపంచకప్ 2023 ఆడమని, తటస్థ వేదికపై మాత్రమే ఆడుతామని పాకిస్థాన్ డిమాండ్ చేసే అవకాశం లేకపోలేదు. తటస్థ వేదికపై మ్యాచ్‌లకు బీసీసీఐ, ఐసీసీ ఆమోదం ఇస్తే పాక్ ఆడుతుంది. అయితే ఇందుకు ముందుగా బీసీసీఐ ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గ్రూప్ దశలో 9 మ్యాచ్‌లను తటస్థ వేదికపై ఆడించాల్సి వస్తుంది. ఒకవేళ నాకౌట్ చేరితే..ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దాదాపుగా పాకిస్థాన్ డిమాండ్‌ను బీసీసీఐ ఒప్పుకొక్కపోవచ్చు.

Also Read: Team India Captain: టీమిండియా కెప్టెన్‌గా ఊహించని పేరు!

ఒకవేళ పాకిస్థాన్ ప్రపంచకప్ 2023 ఆడడానికి భారత్ గడ్డపైకి రాకపోతే.. 9 జట్లతోనే మెగా టోర్నీ జరిగే అవకాశం ఉంది. అయితే పాక్ ఆడకపోతే ప్రపంచకప్ క్వాలిఫైయర్ టోర్నీ నుంచి 10వ జట్టును తీసుకునే అవకాశం ఉందని ఓ నివేదిక పేర్కొంది. ఇప్పటికే ప్రపంచకప్ టోర్నీకి 8 జట్లు అర్హత సాధించగా.. మిగిలిన రెండు స్థానాల కోసం క్వాలిఫైయర్‌ టోర్నీ నేటి నుంచి జరుగుతుంది. ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్ తప్పకుంటే.. క్వాలిఫైయర్ టోర్నీలో టాప్ 3లో ఉన్న జట్టుకు అవకాశం లభిస్తుంది. అంటే క్వాలిఫైయర్‌లో మూడో స్థానంలో ఉన్న జట్టు ప్రపంచకప్ ఆడుతుంది.

ప్రపంచకప్‌ 2023 క్వాలిఫయర్‌ టోర్నీలో సూపర్‌-6 దశకు గురువారం తెరలేవనుంది. రెండు ప్రపంచకప్‌ బెర్తుల కోసం ఆరు జట్లు పోటీలో ఉన్నాయి. గ్రూప్ ఏ నుంచి జింబాబ్వే, నెదర్లాండ్స్, వెస్టిండీస్.. గ్రూప్ బీ నుంచి శ్రీలంక, స్కాట్లాండ్, ఓమన్ జట్లు ఉన్నాయి. జింబాబ్వే, శ్రీలంక ఫేవరెట్‌లుగా బరిలో దిగుతున్నాయి. పేలవ ప్రదర్శన చేసిన వెస్టిండీస్ ప్రపంచకప్‌ 2023కి అర్హత సాధిస్తుందో లేదో చూడాలి. ఇక ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే సూపర్ 6 రౌండ్‌లో జింబాబ్వే, ఓమన్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అక్టోబర్ 5 నుంచి ప్రపంచకప్‌ 2023 మ్యాచ్‌లు జరగనున్నాయి.

Also Read: Sehwag-Sachin: మేం ముసలోళ్లం అయ్యాం.. సచిన్‌ను మోయడం మా వల్ల కాదన్నాం: వీరేంద్ర సెహ్వాగ్