PAK Replacement CWC 2023: ప్రపంచకప్ 2023లో పాకిస్థాన్ ఆడకుంటే.. ఆ జట్టుకు అవకాశం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Here Is The Scenario If Pakistan Don’t Travel To India For 2023 World Cup: భారత గడ్డపై జరిగే ప్రపంచకప్ 2023 టోర్నీకి పాకిస్థాన్ వస్తుందా? లేదా? అనే సందిగ్థత ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రపంచకప్ 2023కి సంబంధించిన షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో పాకిస్థాన్ జట్టు భారత్‌కి వస్తుందని ఐసీసీ కూడా భావిస్తోంది. అయితే తాము భారత్‌కు వచ్చి ప్రపంచకప్ ఆడాలో వద్దో అనే విషయం పాకిస్థాన్ ప్రభుత్వమే నిర్ణయిస్తుందని పీసీబీ అంటుంది. దాంతో అందరూ మెగా టోర్నీలో పాక్ ఆడుతుందా లేదా అని ఆసక్తిగా చుస్తున్నారు. ఒక వేళ భారత గడ్డపైకి పాకిస్థాన్ రాకపోతే ఏం జరుగుతుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
భారత గడ్డపై తాము ప్రపంచకప్ 2023 ఆడమని, తటస్థ వేదికపై మాత్రమే ఆడుతామని పాకిస్థాన్ డిమాండ్ చేసే అవకాశం లేకపోలేదు. తటస్థ వేదికపై మ్యాచ్‌లకు బీసీసీఐ, ఐసీసీ ఆమోదం ఇస్తే పాక్ ఆడుతుంది. అయితే ఇందుకు ముందుగా బీసీసీఐ ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గ్రూప్ దశలో 9 మ్యాచ్‌లను తటస్థ వేదికపై ఆడించాల్సి వస్తుంది. ఒకవేళ నాకౌట్ చేరితే..ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దాదాపుగా పాకిస్థాన్ డిమాండ్‌ను బీసీసీఐ ఒప్పుకొక్కపోవచ్చు.
Also Read
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
Also Read: Team India Captain: టీమిండియా కెప్టెన్‌గా ఊహించని పేరు!
ఒకవేళ పాకిస్థాన్ ప్రపంచకప్ 2023 ఆడడానికి భారత్ గడ్డపైకి రాకపోతే.. 9 జట్లతోనే మెగా టోర్నీ జరిగే అవకాశం ఉంది. అయితే పాక్ ఆడకపోతే ప్రపంచకప్ క్వాలిఫైయర్ టోర్నీ నుంచి 10వ జట్టును తీసుకునే అవకాశం ఉందని ఓ నివేదిక పేర్కొంది. ఇప్పటికే ప్రపంచకప్ టోర్నీకి 8 జట్లు అర్హత సాధించగా.. మిగిలిన రెండు స్థానాల కోసం క్వాలిఫైయర్ టోర్నీ నేటి నుంచి జరుగుతుంది. ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్ తప్పకుంటే.. క్వాలిఫైయర్ టోర్నీలో టాప్ 3లో ఉన్న జట్టుకు అవకాశం లభిస్తుంది. అంటే క్వాలిఫైయర్‌లో మూడో స్థానంలో ఉన్న జట్టు ప్రపంచకప్ ఆడుతుంది.
ప్రపంచకప్ 2023 క్వాలిఫయర్ టోర్నీలో సూపర్-6 దశకు గురువారం తెరలేవనుంది. రెండు ప్రపంచకప్ బెర్తుల కోసం ఆరు జట్లు పోటీలో ఉన్నాయి. గ్రూప్ ఏ నుంచి జింబాబ్వే, నెదర్లాండ్స్, వెస్టిండీస్.. గ్రూప్ బీ నుంచి శ్రీలంక, స్కాట్లాండ్, ఓమన్ జట్లు ఉన్నాయి. జింబాబ్వే, శ్రీలంక ఫేవరెట్లుగా బరిలో దిగుతున్నాయి. పేలవ ప్రదర్శన చేసిన వెస్టిండీస్ ప్రపంచకప్ 2023కి అర్హత సాధిస్తుందో లేదో చూడాలి. ఇక ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే సూపర్ 6 రౌండ్లో జింబాబ్వే, ఓమన్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అక్టోబర్ 5 నుంచి ప్రపంచకప్ 2023 మ్యాచ్‌లు జరగనున్నాయి.
Also Read: Sehwag-Sachin: మేం ముసలోళ్లం అయ్యాం.. సచిన్‌ను మోయడం మా వల్ల కాదన్నాం: వీరేంద్ర సెహ్వాగ్
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!