Site icon NTV Telugu

Hanif Abbasi: “భారత్‌ కోసమే 130 అణుబాంబులు” పాకిస్థాన్ రైల్వే మంత్రి సంచలన వ్యాఖ్యలు

Hanif Abbasi

Hanif Abbasi

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేయడం వల్ల పాకిస్థాన్ తీవ్ర కలత చెందింది. ప్రతిరోజు ఆదేశానికి చెందిన నాయకులు ఏదో ఒక ప్రకటన విడుదల చేస్తున్నారు. భారతదేశం ప్రతీకార చర్యకు పాకిస్థాన్ భయపడుతుందని అర్థమవుతోంది. తాజాగా పాకిస్థాన్ రైల్వే మంత్రి హనీఫ్ అబ్బాసి భారతదేశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రావల్పిండిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారతదేశం పాకిస్థాన్‌కు నీటిని నిలిపివేస్తే, దానికి తగిన సమాధానం ఇస్తామని అన్నాడు.

READ MORE: Puri Jagannadh : విజయ్‌ సేతుపతి-పూరీ మూవీలో మరో స్టార్ బ్యూటి..

“మా క్షిపణులన్నీ భారతదేశం వైపు వెళ్తున్నాయి అని హనీఫ్ అబ్బాసి అన్నాడు. భారతదేశం ఏదైనా సాహసోపేతమైన చర్య తీసుకోవాలని నిర్ణయించుకుంటే.. దానికి మూల్యం చెల్లించాల్సి ఉంటుందని. తమ దగ్గర ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అణు బాంబులు ఉన్నాయని హెచ్చరించాడు. తాము గోరీ, షాహీన్, ఘజ్నవి వంటి క్షిపణులను, 130 అణు బాంబులను భారతదేశం కోసమే ఉంచుకున్నామని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. దౌత్యపరమైన ప్రయత్నాలతో పాటు, తమ సరిహద్దులను రక్షించుకోవడానికి తాము పూర్తి సన్నాహాలు చేస్తున్నామన్నాడు. పహల్గాం దాడి కేవలం ఒక సాకు మాత్రమే అని.. సింధు జల ఒప్పందాన్ని రద్దు చేయాలని భారత్ ఎప్పటినుంచో ప్లాన్ చేస్తుందని ఆరోపించాడు.

READ MORE: Ramayana : ‘రామాయణ’ ఫస్ట్ లుక్ రిలీజ్‌కు గట్టిగా ప్లాన్ చేస్తున్నా మూవీ టీం..

పాకిస్థాన్ సైన్యం అవసరం అనిపించినప్పుడల్లా రైల్వేను ఉపయోగించుకోవచ్చని హనీఫ్ ప్రకటించాడు. పాకిస్థాన్ రైల్వేలు సైన్యానికి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయన్నాడు. హనీఫ్ అబ్బాసి పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్) నాయకుడు. జమాతే ఇ ఇస్లామీ సభ్యుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. 2008లో PML-Nలో చేరాడు. జూన్ 2012లో 500 కిలోల ఎఫెడ్రిన్ డ్రగ్స్‌ను దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో అబ్బాసిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

Exit mobile version