పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేయడం వల్ల పాకిస్థాన్ తీవ్ర కలత చెందింది. ప్రతిరోజు ఆదేశానికి చెందిన నాయకులు ఏదో ఒక ప్రకటన విడుదల చేస్తున్నారు. భారతదేశం ప్రతీకార చర్యకు పాకిస్థాన్ భయపడుతుందని అర్థమవుతోంది. తాజాగా పాకిస్థాన్ రైల్వే మంత్రి హనీఫ్ అబ్బాసి భారతదేశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రావల్పిండిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారతదేశం పాకిస్థాన్‌కు నీటిని నిలిపివేస్తే, దానికి తగిన సమాధానం ఇస్తామని అన్నాడు.
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడితో పాకిస్థాన్‌కు ఎటువంటి సంబంధం లేదని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ బుధవారం అన్నారు. పొరుగు దేశంలో అశాంతికి భారతదేశం మద్దతు ఇస్తోందని ఆరోపించారు. అధికార PML-N పార్టీ సీనియర్ నాయకుడు, ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ సన్నిహితుడు అయిన ఆసిఫ్, జమ్మూ కాశ్మీర్‌లో హింసకు కేంద్రపాలిత ప్రాంతంలోని విప్లవం, స్వదేశీ శక్తులే అంటూ కల్లబొల్లి మాటలు చెప్పారు.
Shehbaz Sharif to set to return as the Pakistan PM: పాకిస్తాన్ ఎన్నికలు 2024 ఫలితాలు వచ్చిన రెండు వారాల రోజుల తర్వాత సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ), పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్)ల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఒప్పందం ప్రకారం.. పాకిస్తాన్ ప్రధానిగా పీఎంఎల్-ఎన్ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్, అధ్యక్షుడిగా పీపీపీ కో ఛైర్మన్ ఆసిఫ్ జర్దారీ బాధ్యతలు…
PML-N alliance talks with PPP in Pakistan Elections 2024: పాకిస్థాన్ ప్రజలు ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ ఇవ్వకపోవడంతో.. అక్కడ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ, మరో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్ (పీఎంఎల్-ఎన్) పార్టీ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) అండతో పీఎంఎల్-ఎన్…