China – Pakistan: ఒక దేశం ఉగ్రవాదానికి పాలు పేసి పెంచింది అయితే.. మరొకటి ప్రపంచానికి పెద్దన్న కావాలని కలలు కంటుంది. ఇప్పుడు ఈ రెండు దేశాల మైత్రి మునుపెన్నడు లేనంత బలీయంగా మారింది. మీకు ఇప్పటికే అర్థం అయ్యి ఉంటుంది ఆ రెండు దేశాలు ఏంటో.. ఒకటి పాకిస్థాన్ అయితే.. మరొకటి చైనా. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ విదేశీ దేశాధినేత సందర్శించని చైనాలోని రహస్య సైనిక స్థావరాన్ని పాక్ అధ్యక్షుడు సందర్శించారు. ఇంతకీ చైనాలోని ఆ రహస్య సైనిక స్థావరం ఏంటి, దాని కథ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Priyanka Arul Mohan: పవన్ డిప్యూటీ సీఎం అవ్వక ముందు అలా.. అయ్యాక ఇలా!
పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ చైనాలోని ఒక రహస్య సైనిక స్థావరం అయిన ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా (AVIC)ని సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇరుదేశాల ఉమ్మడి రక్షణ ఉత్పత్తిని పెంచడం గురించి మాట్లాడారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ భారీ రహస్య స్థావరాన్ని సందర్శించిన మొదటి విదేశీ దేశాధినేతగా జర్దారీ రికార్డ్ సృష్టించారు. ఆయన అక్కడ అత్యంత అధునాతన సైనిక పరికరాలు, ముఖ్యంగా కొత్త యుద్ధ విమానాలు పరిశీలించారు.
తాజాగా పాక్ అధ్యక్షుడి కార్యాలయం జారీ చేసిన ప్రకటనలో.. చైనాలో జర్దారీకి J-10 ఫైటర్ జెట్, పాకిస్థాన్‌తో కలిసి చైనా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న JF-17 థండర్, J-20 విమానాల పురోగతితో సహా AVIC అధునాతన సామర్థ్యాల గురించి వివరించినట్లు తెలిపింది. చైనాలో 10 రోజుల పర్యటనలో ఉన్న ఆయనకు, మానవరహిత వైమానిక వాహనాలు, పూర్తిగా స్వయంప్రతిపత్తి కలిగిన యూనిట్లు, అధునాతన బహుళ-డొమైన్ కార్యకలాపాల కోసం ఇంటిగ్రేటెడ్ కమాండ్, నియంత్రణ వ్యవస్థల గురించి కూడా వివరించారని పేర్కొంది.
ఇక్కడ విశేషం ఏమిటంటే.. చైనా రహస్య స్థావరంలోకి పాక్ అధ్యక్షుడి ప్రవేశం తర్వాత.. చైనా గ్లోబల్ సెక్యూరిటీ కోఆపరేషన్ (GSI) కు పాక్ తన మద్దతును వ్యక్తం చేసింది. ఇది US ప్రపంచ ఆధిపత్యానికి గండి కొడుతూ చైనా ఏర్పాటు చేసిన భద్రతా సంస్థ. పాక్ అధ్యక్షుడు జర్దారీ AVIC సందర్శన, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ జనరల్ అసిమ్ మునీర్ ఇటీవల బీజింగ్ పర్యటన.. ఆపరేషన్ సింధూర్ సమయంలో దాయాదికి జరిగిన నష్టాలను భర్తీ చేయడానికి విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
READ ALSO: Operation Sindoor: ‘‘మసూద్ అజార్ కుటుంబం భారత్ దాడిలో హతమైంది’’.. జైషే ఉగ్రవాది..