Pakistan: పాకిస్తానీలను చంపింది ఇండియన్ ఏజెంట్లే.. భారత్‌పై పాక్ సంచలన ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఇటీవల కాలంలో పాకిస్తాన్‌లో భారత వ్యతిరేక ఉగ్రవాదులు ఒక్కొక్కరిగా గుర్తుతెలియని వ్యక్తుల చంపుతున్నారు. అయితే ఈ హత్యల వెనక భారత్ ఉందని పాక్ ప్రభుత్వం అంతర్గతంగా అనుకుంటున్నప్పటికీ.. ఎప్పుడూ కూడా బహిరంగ వ్యాఖ్యలు చేయలేదు. అయితే తొలిసారిగా పాక్ విదేశాంగ కార్యదర్శి సైరస్ సజ్జాద్ భారత్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఇద్దరు భారత ఏజెంట్లు యోగేష్ కుమార్, అశోక్ కుమార్ ఆనంద్‌లు పాకిస్తాన్ గడ్డపై ఇద్దరు పాకిస్తానీలను హత్యల్లో ప్రయేయం ఉందని ఆరోపించారు.
Read Also: Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల లోగో, ట్యాగ్‌లైన్‌ని ఆవిష్కరించిన ఎలక్షన్ కమిషన్
Also Read
షాహీద్ లతీఫ్ అనే వ్యక్వని కనిపెట్టి హత్య చేసేందుకు యోగేష్ కుమార్ మహ్మద్ ఉమైర్ అనే వ్యక్తిని నియమించుకున్నాడని, స్థానిక నేరస్తులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నట్లు సైరస్ ఆరోపించారు. ఈ హత్యయత్నం చాలా సార్లు విఫలమైన తర్వాత, ఉమైర్ స్వయంగా హత్యలు చేయాలని నిర్ణయించుకున్నాడని, అతను 5 మంది టార్గెట్ కిల్లర్లతో కలిసి టీమ్ ఏర్పాటు చేసుకున్నట్లు అతను వెల్లడించారు. గతేడాది అక్టోబర్ 11న షాహీద్ లతీఫ్‌ని రెండో ప్రయత్నంలో హత్య చేసినట్లు ఆరోపించారు. ప్రస్తుతం లతీఫ్ హత్యలో ప్రమేయం ఉన్న ఉమైర్, ఇతర వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు, వీరికి యోగేష్ కుమార్ అనే ఇండియన్ ఏజెంట్ మార్గనిర్దేశం చేసినట్లు విచారణలో తేలిందని పాక్ విదేశాంగ కార్యదర్శి తెలిపాడు.
మరో పాకిస్తానీ మహ్మద్ రియాజ్‌ని భారత ఏజెంట్ అశోక్ కుమార్ ఆనంద్ హత్య చేయించినట్లు సైరస్ ఖాజీ ఆరోపించాడు. గతేడాది సెప్టెంబర్ 8న మహ్మద్ రియాజ్ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో మహ్మద్ అబ్దుల్లా అలీ అనే వ్యక్తిని పాక్ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో ఇతడిని అశోక్ కుమార్ ఆనందర్, యోగేష్ కుమార్‌లు రిక్రూట్ చేసుకున్నట్లు తేలిందని పాక్ ఆరోపించింది. టెలిగ్రామ్ ద్వారా కమ్యూనికేషన్ చేసుకుని, మధ్యవర్తుల ద్వారా హంతకులకు డబ్బులు ఇచ్చినట్లు విదేశాంగ కార్యదర్శి సైరస్ సజ్జాద్ ఆరోపించారు. గతేడాది ఈ హత్యలు సియాల్‌కోట్, రావల్‌కోట్‌లో జరిగాయి. చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదులకు జైష్-ఎ-మహ్మద్ మరియు లష్కరే తోయిబా ఉగ్రసంస్థలతో సంబంధాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!