Pakistan : పాకిస్థాన్ సైన్యం పాడు పని.. చిన్నారులపై లైగింక దోపిడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan : పాకిస్థాన్‌లో ఇప్పటి వరకు చిన్నారులపై లైంగిక దోపిడీ, అత్యాచారానికి సంబంధించిన అతిపెద్ద కేసు వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్‌లోని ఖైబర్-పఖ్తున్ఖ్వా ప్రాంతంలో పాకిస్థాన్ సైన్యం చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఖైబర్-పఖ్తున్ఖ్వాలోని పరాచినార్ ప్రాంతంలో పెద్ద రాకెట్ బట్టబయలైంది. పాకిస్తాన్ ఆర్మీ, మిలిటరీ ఇంటెలిజెన్స్ సీనియర్ అధికారులకు లైంగిక దోపిడీకి పిల్లలను సరఫరా చేసినట్లు కూడా వెల్లడైంది.
సమాచారం అందుకున్న పరాచినార్ పోలీసులు మొబైల్ షాపు యజమాని సయ్యద్ తాహిర్‌ను అదుపులోకి తీసుకున్నారు. దుకాణదారుడు పిల్లలకు ఆడుకోవడానికి మొబైల్ ఫోన్లు ఇచ్చేవాడు. దాని సాకుతో అతను పిల్లల అభ్యంతరకరమైన వీడియోలను తీసి ఆపై వారిని బ్లాక్ మెయిల్ చేసి ఆర్మీ, మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారులకు పంపేవాడు.
Also Read
Read Also:Sidhu moosewala: సిద్ధూ మూసేవాలా తండ్రి కీలక నిర్ణయం.. ఎన్నికల్లో పోటీపై బిగ్ ట్విస్ట్!
నిందితుడి ల్యాప్‌టాప్ నుంచి ఇప్పటివరకు 1200కు పైగా వీడియోలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం గ్యాంగ్‌లో దాదాపు ఐదారుగురు వ్యక్తులు ఉన్నారు. ఇందులో పాకిస్థాన్ ఆర్మీకి చెందిన మేజర్ ఆఫ్రిది మాస్టర్ మైండ్ అని చెప్పబడుతోంది. ఈ అమాయక పిల్లలందరినీ 73 బ్రిగేడ్ పరాచినార్‌కు పంపారు, అక్కడ వారిని పాక్ ఆర్మీ అధికారులు లైంగికంగా వేధించారు. గత ఐదేళ్లలో అతను పరాచినార్‌కు చెందిన వందలాది మంది పిల్లలను లైంగికంగా దోపిడీ చేశాడు.. అత్యాచారం చేశాడు.
ఈ పిల్లలందరి వయస్సు 14 సంవత్సరాల కంటే తక్కువ. వందలాది మంది పిల్లలు దీని బారిన పడ్డారు. నిందితుడిని ఇంతకుముందు కూడా అరెస్టు చేశారు. అయితే పాకిస్తాన్ ఆర్మీకి చెందిన కెప్టెన్, మేజర్ ఒత్తిడి కారణంగా నిందితుడిని విడుదల చేశారు. పారాచినార్‌లో మైనర్లపై లైంగిక దోపిడీకి పాల్పడిన మిలటరీ అధికారులు, సిబ్బందిపై పెద్ద చర్యలు తీసుకుని.. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన కార్ప్స్ కమాండర్ 11 కార్ప్స్, లెఫ్టినెంట్ జనరల్ హసన్ అజర్ హయత్ దర్యాప్తునకు ఆదేశించారు. ఈ వార్తలను అణిచివేసేందుకు పాక్ సైన్యం ఇప్పుడు ప్రజలను బెదిరిస్తోంది. చాలా మంది వ్యక్తుల సోషల్ మీడియా ఖాతాలను కూడా సస్పెండ్ చేస్తోంది.
Read Also:Shah Rukh Khan-Ganguly: సౌరవ్ గంగూలీని ఆశ్చర్యపరిచిన షారుఖ్.. వీడియో వైరల్!
తాజావార్తలు
-
Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
-
M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
-
M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
-
Hyderabad Metro Phase 2: పాతబస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బూస్ట్.. ఇక పనుల్లో స్పీడ్..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..