టాలీవుడ్ ఆడియెన్స్‌కు బాలీవుడ్ బ్యూటీ సోనాలి బింద్రే గురించి పరిచయం అక్కర్లేదు. తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ అందాల తార.. హిందీలో కూడా సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అయితే 2018లో క్యాన్సర్ బారిన పడింది సోనాలి అమెరికాలోని న్యూయార్క్ వెళ్లి చికిత్స తీసుకుందీ. మనో ధైర్యంతో మహమ్మారిని జయించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సోనాలి తాను క్యాన్సర్ చికిత్స తీసుకున్న అనుభవాలను పంచుకుంది..
Also Read : Mahesh Babu : రూ. 1.5 లక్షల టీ షర్ట్‌తో.. అఖిల్ రిషప్షన్‌లో సందడి చేసిన మహేశ్ బాబు
‘ ఇండస్ట్రీలో దాదాపు నా మొదటి డెలివరీ సమయం వరకు నటించాను. డెలివరీ అయిన తర్వాత విరామం తీసుకున్న. ఎందుకంటే నటిగా నా బాధ్యత ఎలా నిర్వర్తించానో, తల్లిగా కూడా అంతే నిర్వర్తించాలి కదా.. అందుకే విరామం తీసుకున్న. ఆ తర్వాత టీవీ షో ద్వారా ప్రేక్షకులను పలకరించాను. కానీ ఆ షో చేస్తున్నప్పుడే నాకు క్యాన్సర్ నిర్ధారణ అయింది. దీంతో కెరీర్‌కు మరోసారి బ్రేక్ పడింది. కానీ ఆ క్షణాలు నా జీవితంలో చాలా బాధాకరమైనవి. కానీ క్యాన్సర్‌కు చికిత్స తీసుకున్న సమయంలో హీరో సల్మాన్ నాకెంతో దైర్యాన్నిచ్చారు. న్యూయార్క్‌ల్లో నా చికిత్స ఎలా సాగుతుందని రోజూ ఆరా తీసేవారు. అదే సమయంలో రెండు సార్లు న్యూయార్క్ వచ్చి నను పరామర్శించారు. ఆయనకు ఎప్పటికీ నా కృతజ్ఞతలు. ఇతరుల మాటలు కూడా మెడిసిన్ లా పని చేస్తాయి అంటారు. నా విషయంలో అలాగే జరిగింది’ తెలిపారు.