NTV Telugu Site icon

Pakistan: చైనా షాక్ ఇచ్చేందుకు రెడీ అయిన పాకిస్థాన్.. భారతే అందుకు కారణమా..?

Ind Vs Pak

Ind Vs Pak

భారత్‌తో వాణిజ్యం కోసం మార్గాలను అన్వేషిస్తున్నట్లు పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం నాడు మరోసారి దీనిపై చర్చించింది. గత కొద్ది రోజుల క్రితం, పాకిస్తాన్ కొత్త విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ లండన్‌లో ఒక ప్రకటన చేశారు. భారత్‌తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణను పాకిస్థాన్ తీవ్రంగా పరిగణిస్తుందని ఆయన చెప్పారు. ఆగస్టు 2019 నుంచి రెండు దేశాల మధ్య వాణిజ్యం నిలిచిపోయాయి.. వాటిని తిరిగి ప్రారంభించాలని అనుకుంటున్నామని తెలిపారు. అలాగే, ఇస్లామాబాద్‌లో భారతదేశంతో వాణిజ్యాన్ని పునఃప్రారంభించాలనే ప్రతిపాదనను ప్రభుత్వం సమీక్షిస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్‌ను ధృవీకరించారు.
ఇక, భారతదేశంతో వాణిజ్యంపై పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖతో సహా పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఇటువంటి ప్రతిపాదనలను క్రమం తప్పకుండా సమీక్షిస్తుంది.

Read Also: Komatireddy: హరీష్ రావ్ బీజేపీలో చేరడం ఖాయం.. కోమటి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్ చాలా అవసరాలకు చైనా పైనే ఆధారపడటం గమనార్హం. పాకిస్థాన్‌లో చైనా భారీగా పెట్టుబడులు పెట్టింది. అయితే చైనా నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పాకిస్థాన్‌లో తమ పౌరులపై దాడులు ఆగడం లేదు. అలాగే, చైనా పౌరులు మరణించిన తర్వాత ప్రావిన్స్‌లోని స్వాబీ జిల్లాలో టార్బెలా జల విద్యుత్ విస్తరణ ప్రాజెక్టు నిర్మాణ పనులను చైనా కంపెనీ ‘పవర్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ చైనా’ (పీసీసీసీ) ప్రారంభించిందని ప్రభుత్వ వర్గాలను తెలిపినట్లు ‘డాన్’ వార్తాపత్రిక తన వార్తలో పేర్కొంది. షాంగ్లా జిల్లాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో.. నిర్మాణ సంబంధిత పనులు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. దీంతో 2,000 మందికి పైగా కార్మికులు ఇక్కడ పని నుంచి తొలగించబడ్డారు.

Read Also: Mukesh Kumar Meena: అధికారులు తప్పకుండా ఈసీ ఆదేశాలు అమలు చేయాల్సిందే..

ఈ దాడులను పాకిస్థాన్ ఆపలేకపోతే.. చైనా తన పెట్టుబడులను తగ్గించేస్తుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. దాడి జరిగిన వెంటనే పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ తో పాటు అతని మంత్రివర్గం మొత్తం చైనా రాయబార కార్యాలయానికి వెళ్లి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పాడింది. దీంతో పాకిస్తాన్ ఇప్పుడు చైనా కాకుండా ఇతర వాణిజ్య మార్గాలను కూడా ఆన్వేషిస్తుంది. తద్వారా గతంలో భారత్ తో ఉన్న ఆర్థిక సంబంధాలను పెట్టుకోవాలని చూస్తుంది.