Pakistan: బంగాళాఖాతంపై పాకిస్థాన్ కన్ను.. భారత్‌కు సముద్ర సరిహద్దుల్లో కొత్త సవాల్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: భారత నౌకాదళ చరిత్రలో ‘హాంగోర్’ (Hangor) అనే పేరుకు ఒక ప్రత్యేకమైన, చేదైన చరిత్ర ఉంది. 1971 భారత్-పాక్ యుద్ధంలో పాకిస్థాన్‌కు చెందిన ‘పిఎన్ఎస్ హాంగోర్’ జలాంతర్గామి.. భారత యుద్ధనౌక ఐఎన్ఎస్ ఖుక్రీని ముంచేసింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత యుద్ధంలో ఒక భారతీయ నౌక మునిగిపోవడం అదే మొదటిసారి. ఆ ఘటనలో కెప్టెన్ మహేంద్ర నాథ్ ముల్లాతో సహా 176 మంది భారత నౌకాదళ సిబ్బంది వీరమరణం పొందారు. నాటి యుద్ధంలో పాకిస్థాన్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని, బంగాళాఖాతంలో తన ఉనికిని పూర్తిగా కోల్పోయినప్పటికీ, ఆ నాటి స్మృతులకు ప్రతీకగా పాక్ తన సరికొత్త జలాంతర్గామి క్లాస్‌కు మళ్లీ ‘హాంగోర్’ అనే పేరునే పెట్టుకుంది.
అయితే, 1971 యుద్ధం ముగిసిన 55 ఏళ్ల తర్వాత, ఇప్పుడు మరో ‘హాంగోర్’ వార్తల్లో నిలిచింది. చైనాలో తయారైన పాకిస్థాన్ మొదటి అత్యాధునిక ‘హాంగోర్-క్లాస్’ సబ్‌మెరైన్ గత ఏప్రిల్‌లో కమిషన్ చేయబడి, గత వారం కరాచీ తీరానికి చేరుకుంది. ఈ క్లాస్‌కు చెందిన మొత్తం 8 జలాంతర్గాములను పాక్ నావికాదళంలో చేర్చుకోనుంది. ఈ చైనా నిర్మిత సబ్మెరైన్లు ‘ఎయిర్-ఇండిపెండెంట్ ప్రొపల్షన్’ (AIP) సాంకేతికతతో పనిచేస్తాయి. ఇవి సాధారణ డీజిల్-ఎలక్ట్రిక్ జలాంతర్గాముల్లా బ్యాటరీలను రీఛార్జ్ చేసుకోవడానికి మాటిమాటికీ సముద్రం పైభాగానికి రానవసరం లేదు. ఎక్కువ రోజులు నీటి లోపలే మునిగి ఉండగలవు కాబట్టి, వీటిని గుర్తించడం శత్రుదేశాలకు చాలా కష్టం.
Also Read
- VMC Contractors Strike: వీఎంసీ కాంట్రాక్టర్లతో మంత్రి నారాయణ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
- Sonia Gandhi: ‘బిలాంగింగ్’ పేరుతో సోనియాగాంధీ ఆత్మకథ.. రాజీవ్‌గాంధీతో ప్రేమ ముచ్చట్లు
- Hockey World Cup 2026: మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత్ జోరు.. దక్షిణాఫ్రికాపై 6-1 ఘన విజయం
- TGSRTC Bus Route Changes: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ఎఫెక్ట్... ఆర్టీసీ బస్సు రూట్లలో కీలక మార్పులు.. పూర్తి వివరాలు ఇవిగో..
బంగాళాఖాతంలోకి పాక్ ఎంట్రీ?
ఇన్నాళ్లూ పాకిస్థాన్ నౌకాదళం కేవలం ఉత్తర అరేబియా సముద్రానికే పరిమితమైంది. కానీ, ఈ కొత్త హాంగోర్ సబ్మెరైన్ల రాకతో బంగాళాఖాతంలోనూ తమ ఉనికిని చాటుకుంటామని పాక్ సీనియర్ అధికారులు బహిరంగంగానే చెప్తున్నారు. ఇటీవల శ్రీలంకలోని కొలంబో పోర్టుకు వచ్చిన పాక్ యుద్ధనౌక ‘పిఎన్ఎస్ తైమూర్’ వేదికగా కమోడోర్ ఒమర్ ఫారూఖ్ మాట్లాడుతూ.. ఈ కొత్త సబ్మెరైన్లు తమకు బంగాళాఖాతంలో పట్టు సాధించేందుకు ఉపయోగపడతాయని, ఇది ఒక ‘గేమ్ ఛేంజర్’ అని వ్యాఖ్యానించారు. సాధారణంగా బంగాళాఖాతం భారత్‌కు వ్యూహాత్మక స్థావరం. విశాఖపట్నంలోని ఈస్టర్న్ నావల్ కమాండ్, అండమాన్ నికోబార్ దీవులు ఇక్కడే ఉన్నాయి. పైగా భారత్-బంగ్లాదేశ్ మధ్య వాణిజ్యానికి ఇది ప్రధాన మార్గం. అంతర్జాతీయ చట్టాల ప్రకారం తీరం నుంచి 12 నాటికల్ మైళ్ల అవతల ఉన్న అంతర్జాతీయ జలాల్లో ఏ దేశ యుద్ధనౌకలైనా తిరగొచ్చు. కానీ, భారత్ తన సొంత పెరడుగా భావించే బంగాళాఖాతంలోకి పాక్ జలాంతర్గాములు రావడం భద్రతా పరంగా కొంత కలవరపరిచే విషయమే.
బంగ్లాదేశ్‌తో మారుతున్న సమీకరణాలు
పాకిస్థాన్ ఆశయాలకు బంగ్లాదేశ్‌లో మారిన రాజకీయ పరిస్థితులు మరింత ఊతాన్ని ఇస్తున్నాయి. 2024లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయి, ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఢాకా-ఇస్లామాబాద్ మధ్య సంబంధాలు అనూహ్యంగా పుంజుకున్నాయి. దశాబ్దాల తర్వాత కరాచీ-ఢాకా మధ్య నేరుగా విమాన సర్వీసులు, సముద్ర వాణిజ్యం ప్రారంభమయ్యాయి. 2024, 2025 లలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం భారీగా పెరిగింది. సైనిక పరంగానూ ఇరు దేశాలు దగ్గరవుతున్నాయి. బంగ్లాదేశ్ ఎయిర్ చీఫ్ పాకిస్థాన్‌లో పర్యటించి జెఎఫ్-17 (JF-17) ఫైటర్ జెట్ల కొనుగోలుపై ఆసక్తి చూపించారు. అంతేకాదు, నవంబర్ 2025లో పాక్ యుద్ధనౌక ‘పిఎన్ఎస్ సైఫ్’ బంగ్లాదేశ్‌లోని చటోగ్రామ్ పోర్టును సందర్శించింది. 1971 తర్వాత ఒక పాక్ యుద్ధనౌక బంగ్లాదేశ్‌కు రావడం ఇదే మొదటిసారి. వీరిద్దరి మధ్య ఇంటెలిజెన్స్ షేరింగ్, ఉమ్మడి సైనిక విన్యాసాల కోసం రక్షణ ఒప్పందాలు కూడా జరుగుతున్నట్లు సమాచారం.
భారత్‌కు ముప్పేనా?
బంగ్లాదేశ్‌తో పాక్ బంధం బలపడుతున్నప్పటికీ, ఫిబ్రవరిలో తారిఖ్ రెహమాన్ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అయిన తర్వాత భారత్-బంగ్లాదేశ్ సంబంధాలలో కూడా కొత్త సాన్నిహిత్యం కనిపిస్తోంది. మరి 1971 నాటి పరిస్థితులతో పోలిస్తే నేటి భారత నౌకాదళం ఎంతో శక్తివంతమైనది. భారత్ దగ్గర అణుశక్తితో నడిచే జలాంతర్గాములు, రెండు విమాన వాహక నౌకలు (Aircraft Carriers), అత్యాధునిక నిఘా వ్యవస్థలు ఉన్నాయి. కాబట్టి, ఈ కొత్త హాంగోర్ సబ్మెరైన్లతో బంగాళాఖాతంలో భారత్ ఆధిపత్యాన్ని పాకిస్థాన్ పూర్తిగా మార్చలేకపోయినా, మన సరిహద్దుల్లో ఒక చిన్న ‘ఇరిటెంట్’ (విసుగు కలిగించే అంశం) లాగా మారే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది.
తాజావార్తలు
-
Colgate: కొల్గేట్ ప్రియులకు షాక్.. టూత్‌పేస్ట్ ధరలు పెరగనున్నాయా?
-
VMC Contractors Strike: వీఎంసీ కాంట్రాక్టర్లతో మంత్రి నారాయణ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
-
Sonia Gandhi: ‘బిలాంగింగ్’ పేరుతో సోనియాగాంధీ ఆత్మకథ.. రాజీవ్‌గాంధీతో ప్రేమ ముచ్చట్లు
-
Hockey World Cup 2026: మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత్ జోరు.. దక్షిణాఫ్రికాపై 6-1 ఘన విజయం
-
TGSRTC Bus Route Changes: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ఎఫెక్ట్… ఆర్టీసీ బస్సు రూట్లలో కీలక మార్పులు.. పూర్తి వివరాలు ఇవిగో..
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!