Defence Department : దేశాన్ని కాపాడటంలో రక్షణశాఖ ఎంత కీలకం అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రక్షణశాఖకు సంబంధించిన ఫొటోలు గానీ వీడియోలు గానీ బయట పెడితే కఠిన చర్యలు తీసుకుంటాయి ప్రభుత్వాలు. అలాంటిది అనకాపల్లికి చెందిన ఓ వ్యక్తి రక్షణశాఖకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు ఏకంగా సోషల్ మీడియాలో పెడుతున్నాడు. ఇది గమనించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అనకాపల్లి జిల్లా అచ్చుతాపురంకు చెందిన బి రవి(36) ఐటిఐ పూర్తి చేసి డాక్ యార్డ్ షిప్…
భారత్ భద్రత కోసం తాజాగా పెద్ద అడుగు వేసింది. రెండు కొత్త అణు జలాంతర్గాముల నిర్మాణానికి భారత్ ఆమోదం తెలిపింది. ప్రధాని నేతృత్వంలోని భద్రతపై కేబినెట్ కమిటీ రెండు స్వదేశీ అణు జలాంతర్గాములను నిర్మించేందుకు అనుమతి ఇచ్చింది.
Indian Navy : భారత నావికాదళంలోకి త్వరలో 7 కొత్త యుద్ధనౌకలు, ఒక జలాంతర్గామిని చేర్చబోతున్నారు. ఇది తన సముద్ర భద్రతను మరింత పటిష్టం చేసుకునే దిశగా భారతదేశం నుండి ఒక పెద్ద అడుగు అవుతుంది.
మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారక నగరాన్ని దర్శించేందుకు ‘ద్వారకా సబ్ మెరైన్ టూరిజం’ ప్రాజెక్టును గుజరాత్ ప్రభుత్వం చేపడుతున్నట్లు ప్రకటించింది.
హిందూ మహాసముద్రంలో శాస్త్రీయ ప్రయోగాలు చేస్తున్న నెపంతో చైనా గూఢచారి నౌకలు హిందూ మహాసముద్ర ప్రాంతంలోని విస్తారమైన ప్రాంతాల్లో సర్వే చేస్తున్నాయి. ఈ నౌకల నుంచి సేకరించిన డేటా మలక్కా జలసంధి, తూర్పు హిందూ మహాసముద్రం నిస్సార జలాల ద్వారా నావిగేట్ చేయడానికి ప్రయత్నిస్తున్న చైనీస్ జలాంతర్గాములకు అమూల్యమైనది.
రష్యా- ఉక్రెయిన్ వ్యవహారం చిలికిచిలికి గాలివానలా మారేలా కనిపిస్తున్నది. ఇప్పటికే నాటో, అమెరికా బలగాలు పెద్ద ఎత్తున మొహరిస్తున్నాయి. నాటో దళాలకు అండగా ఉండేందుకు మాత్రమే తమ దళాలను పంపుతున్నట్లు అమెరికా చెబుతున్నది. ఫిబ్రవరి 16 వ తేదీన ఉక్రెయిన్ పై దాడికి దిగేందుకు రష్యా ప్రయత్నాలు చేస్తున్నదని అమెరికా వాదిస్తున్నది. రష్యా దాడులకు సంబంధించి తమ దగ్గర పక్కాసమారం ఉందని అమెరికా చెబుతున్నది. రష్యా తన జలాల్లో లైవ్ వార్ ట్రయల్స్ నిర్వహణ దానికోసమేనని చెబుతున్నది.…
దక్షిణ చైనా సముద్రంలో చైనా దేశం ఆదిపత్యం సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ జలాల పరిధిలోని దీవులు, దేశాలు తమవే అని వాదిస్తోంది. తైవాన్‌ను ఎలాగైనా దారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నది. తైవాన్‌కు రక్షణ కల్పించేందుకు అమెరికా ఆ దేశానికి సమీపంలో గువామ్ నావికాదళాన్ని ఏర్పాటు చేసింది. అమెరికాకు చెందిన అణుశక్తి జలాంతర్గామి యూఎస్ఎస్ కనెక్టికట్ ఈ జలాల్లో పహారా కాస్తుంటుంది. దక్షిణ చైనా సముద్రంలోని అంతర్జాటీయ జలాల్లోకి ప్రవేశించే సమయంలో ఈ జలాంతర్గామి ప్రమాదానికి గురైంది.…