Site icon NTV Telugu

Pakistan: కొత్త బిచ్చగాడు పొద్దెరగడు.. పైసల కోసం పాక్‌ ప్రయత్నాలు

Pak

Pak

Pakistan: దాయాది దేశం పాకిస్తాన్ ఇప్పుడు ‘కొత్త బిచ్చగాడు పొద్దెరగడు’ అన్న చందంగా మారింది. భారత్‌తో పెట్టుకున్న కయ్యం ఆ దేశానికి పెను శాపంగా పరిణమించింది. ఆర్థికంగా దివాళా తీసిన పాక్, ఇప్పుడు నిధుల కోసం ప్రపంచ దేశాల ముందు ఆర్తనాదాలు చేస్తోంది. తొందరపాటుతో యుద్ధానికి దిగిన పాక్, భారత దాడులతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది. స్టాక్ మార్కెట్ కార్యకలాపాలు నిలిచిపోవడంతో నిధుల కొరత ఏర్పడింది. తమ దేశాన్ని ఆదుకోవాలంటూ అంతర్జాతీయ భాగస్వాములను, ముఖ్యంగా ప్రపంచ బ్యాంకును వేడుకుంటోంది.

Amina Nijam : తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న స్టార్ బ్యూటీ..

ఒకవైపు యుద్ధ పరిస్థితులు, మరోవైపు ఆర్థిక సంక్షోభంతో పాకిస్తాన్ తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయింది. పాక్ పాలకుల ముందుచూపు లేని చర్యలపై అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యుద్ధానికి దిగిన తర్వాత ఆర్థిక సహాయం కోసం అర్ధించడం ఏమిటని నిలదీస్తున్నారు. ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభావం పడటంతో చిన్న వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఈ సంక్షోభం నుంచి పాకిస్తాన్ ఎలా బయటపడుతుందో చూడాల్సి ఉంది.

Single : ‘సింగిల్’ మూవీ పై అల్లు అర్జున్ ట్వీట్ వైరల్..

Exit mobile version