Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Pakistan Defence Minister Khawaja Asif Remarks On Us Afghanistan War

Khawaja Asif: ‘అమెరికా మనల్ని టాయిలెట్ పేపర్ కంటే హీనంగా వాడుకుంది’.. నిజం ఒప్పుకున్న పాక్ రక్షణ మంత్రి

Published Date :February 11, 2026 , 10:18 am
By RAMAKRISHNA KENCHE
Khawaja Asif: ‘అమెరికా మనల్ని టాయిలెట్ పేపర్ కంటే హీనంగా వాడుకుంది’.. నిజం ఒప్పుకున్న పాక్ రక్షణ మంత్రి
  • Follow Us :
  • google news
  • dailyhunt

Khawaja Asif: అమెరికా గురించి ప్రపంచం మొత్తం తెలుసు. ఎప్పుడు ఎలాంటి వైఖరిని ప్రదర్శిస్తుందో.. దేశాన్ని ఎందుకు వాడుకుంటుందో బాధిత దేశం నష్టపోయే వరకు తెలియదు. ఈ అంశంపై పాకిస్థాన్‌ పార్లమెంట్‌లో రచ్చ చోటు చేసుకుంది. పాకిస్థాన్‌ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీశాయి. అమెరికా తన స్వప్రయోజనాల కోసం పాకిస్థాన్‌‌ను ఉపయోగించుకుందని, పని అయిపోయిన తర్వాత టాయిలెట్ పేపర్ కంటే హీనంగా విసిరేస్తుందని విమర్శించారు. ఆసిఫ్ మాటల్లో బాధ స్పష్టంగా కనిపించింది. 1980లలో సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన యుద్ధంలో పాకిస్థాన్‌ పాల్గొన్న తీరు గురించి ప్రశ్నించారు. అది మతపరమైన యుద్ధం కాదని, ఇస్లాం రక్షణ కోసం చేసింది కాదన్నారు. అమెరికా వ్యూహంలో భాగంగానే యుద్ధం కొనసాగిందని అంగీకరించారు. ఆ సమయంలో రష్యా ఆఫ్ఘనిస్తాన్‌ను పూర్తిగా ఆక్రమించి, జిహాద్ ప్రకటించాల్సిన పరిస్థితి లేదని చెప్పారు. అయినా పాకిస్థాన్‌ ఆ యుద్ధంలోకి దూకిందని తెలిపారు. ఆ నిర్ణయాల ప్రభావం ఇప్పటికీ దేశం అనుభవిస్తోందని ఎట్టకేలకు నిజం ఒప్పున్నారు. జిహాద్ పేరుతో యువకులను యుద్ధాలకు పంపడం పెద్ద తప్పిదమన్నారు. యుద్ధాన్ని సమర్థించేందుకు విద్యా పాఠ్యాంశాల్లో మార్పులు చేశారని, ఆ మార్పులను ఇప్పటికీ పూర్తిగా సరిచేయలేకపోతున్నామని తెలిపారు. అంటే ఒకప్పుడు తీసుకున్న నిర్ణయాలు సమాజంపై ఎంత లోతైన ప్రభావం చూపాయో మంత్రి మాటల్లో తెలుస్తోంది.

READ MORE: Toxic : ‘టాక్సిక్’ ఓవర్సీస్ డీల్ క్లోజ్.. కన్నడ సినిమా చరిత్రలో కనివినీ ఎరుగని రికార్డు!

1999 తర్వాత పరిస్థితి మరింత క్లిష్టమైందని ఆసిఫ్ చెప్పారు. అమెరికా మద్దతు పొందాలనే ఉద్దేశంతో మళ్లీ వాషింగ్టన్‌తో కలిసి నడిచామని, కానీ ఆ నిర్ణయం దేశానికి చాలా నష్టం తెచ్చిపెట్టిందని అన్నారు. 2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికా నేతృత్వంలో జరిగిన ‘వార్ ఆన్ టెరర్’లో పాకిస్థాన్‌ తాలిబాన్‌కు వ్యతిరేకంగా పోరాడింది. అయితే కొంతకాలం తర్వాత అమెరికా అక్కడి నుంచి వెళ్లిపోయిందని, కానీ ఆ యుద్ధం వల్ల వచ్చిన సమస్యలు మాత్రం పాకిస్థాన్‌‌ను ఇప్పటికీ వెంటాడుతున్నాయని పేర్కొన్నారు. మాజీ సైనిక పాలకులు జియా ఉల్ హక్, పరవేజ్ ముషర్రఫ్‌లపై నేరుగా విమర్శలు చేశారు. దేశానికి సంబంధించినవి కాని యుద్ధాల్లో పాకిస్థాన్‌‌ను తోసేశారని ఆరోపించారు. ఇతరుల యుద్ధాల్లో పాకిస్థాన్‌ ఒక బొమ్మలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. “ఈ నష్టాన్ని ఎప్పటికీ పూడ్చలేం” అని ఆసిఫ్ అన్నారు. తీసుకున్న కొన్ని నిర్ణయాలు తిరిగి మార్చలేని తప్పిదాలుగా మిగిలిపోయాయని చెప్పారు. ఒకప్పుడు మిత్రత్వం పేరిట తీసుకున్న నిర్ణయాలు దేశానికి ఎంతటి భారం అయ్యాయో ఇప్పుడు స్పష్టమవుతోందని మంత్రి మాటల్లో కనిపించింది.

READ MORE: Canada: కెనడా స్కూల్‌లో ఘోరం.. విచక్షణారహితంగా కాల్పులు.. 10 మంది మృతి

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Afghanistan War Pakistan Role
  • International Politics News
  • Khawaja Asif Comments
  • Pakistan Parliament Debate
  • pakistan political news

తాజావార్తలు

  • Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!

  • Chia Seeds : మధుమేహానికి చెక్ పెట్టే చియా సీడ్స్.. షుగర్ లెవల్స్ తగ్గాలంటే ఇలా తిని చూడండి!

  • Women Reservation: అంకెల్లో గెలిచి.. అధిక్యంలో ఓడి.. బిల్లు వీగిపోవడం వెనుక ఉన్న కారణాలివే..

  • Reed Hastings: సొంత కంపెనీ నుంచి తప్పుకున్న ఫౌండర్.. నెట్‌ఫ్లిక్స్‌లో ముగిసిన ‘రీడ్ హేస్టింగ్స్’ శకం

  • Womens Reservation Bill: నారీ శక్తి బిల్లుపై ఓటమి.. మరి మిగిలిన రెండు బిల్లుల సంగతేంటి?

ట్రెండింగ్‌

  • రాత్రి పడుకునే ముందు శరీరంలోని ఈ రెండు భాగాలకు ఆవనూనెతో ఎందుకు మర్దన చేయాలి?

  • Burning Feet Hacks: పాదాల్లో మంటలా..? ఇంటి చిట్కాలతో ఇలా చెక్ పెట్టండి.!

  • Neem Juice: వేప రసం తాగుతున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే.!

  • Health Tips : వర్కౌట్ బట్టల్లో ప్రాణాంతక రసాయనాలు.. ఫిట్‌నెస్ కోసం వెళ్తే అనారోగ్యం ఫ్రీ.!

  • Train Ticket Rules: రైలు ప్రయాణికుల టెన్షన్‌కు ఇక సెలవు.. అమల్లోకి కొత్త చార్ట్ రూల్స్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions