Pakistan Cricket: పాక్ క్రికెట్ హిస్టరీలో బిగ్గెస్ట్ సర్జరీ.. ఈ స్టార్ల కెరీర్ ఇక ముగిసినట్టేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Cricket: 2026 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు ఘోర ప్రదర్శన ఆ దేశ క్రికెట్లో పెను మార్పులకు దారితీస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టోర్నీలో జట్టు వైఫల్యంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) కన్నెర్ర చేయడంతో, కెప్టెన్ సల్మాన్ అలీ అఘాతో పాటు పలువురు సీనియర్ ఆటగాళ్ల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. మార్చి 2025లో మహ్మద్ రిజ్వాన్ స్థానంలో టీ20 సారథిగా పగ్గాలు చేపట్టిన సల్మాన్ అలీ అఘా, ఈ మెగా టోర్నీలో జట్టును నడిపించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ప్రస్తుతం పాక్ జట్టు సూపర్-8 దశలోనే ఇంటిముఖం పట్టే పరిస్థితి నెలకొంది. శ్రీలంకపై గెలిచినా సెమీస్ చేరడం గగనమే కావడంతో పీసీబీ ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. ఈ మెగా టోర్నీ ముగిసిన వెంటనే పాక్.. క్రికెట్ హిస్టరీలో బిగ్గెస్ట్ సర్జరీ చేయబోతుందని, దీంతో బాబర్, ఆఘా సహా పలువురు స్టార్లపై వేటుపడే ఛాన్స్ ఉందని సమాచారం. ఇంతకీ వాళ్లు ఎవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Israel-Iran War: భయం గుప్పిట ‘‘గల్ఫ్ బతుకులు’’.. ఎంత మంది భారతీయులు ఉన్నారంటే..
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, వరల్డ్ కప్ ముగియగానే పాక్ జట్టులో భారీ ప్రక్షాళన జరగనుంది. సల్మాన్ అలీ అఘా కెప్టెన్సీ కోల్పోవడంతో పాటు జట్టులో స్థానం కోల్పోయే ప్రమాదం ఉందని సమాచారం. టీ20ల్లో పాక్ తరపున అత్యధిక పరుగులు చేసిన రికార్డు బాబర్ అజామ్ ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఫామ్ లేమితో సతమతమవుతున్న ఈ స్టార్ బ్యాటర్‌ను కూడా పక్కన పెట్టాలని బోర్డు భావిస్తోందని తెలుస్తుంది. అలాగే ఉస్మాన్ ఖాన్‌తో పాటు మరికొందరు సీనియర్లకు ఇది చివరి టీ20 టోర్నీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. నిర్భయంగా ఆడే యువ రక్తాన్ని జట్టులోకి ఆహ్వానించాలని, పాతతరం ఆటగాళ్లకు స్వస్తి పలకాలని పీసీబీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
కొత్త కెప్టెన్ రేసులో ఆ ఇద్దరు..
సల్మాన్ అఘా తర్వాత జట్టును నడిపించే బాధ్యతను ఎవరికి అప్పగించాలనే దానిపై కసరత్తు ఇప్పటికే మొదలైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆ రేసులో ఇద్దరు ఆటగాళ్లు ముందున్నారు. మొదటి వ్యక్తి షాదాబ్ ఖాన్. గతంలో కెప్టెన్సీ చేసిన అనుభవం ఉండటం ఇతనికి కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు. రెండోవ వ్యక్తి.. షాహీన్ షా అఫ్రిది. పాక్ స్టార్ పేసర్ షాహీన్‌కు పగ్గాలు ఇచ్చే ఆలోచనలో బోర్డు ఉందని తాజా సమాచారం. గత ఏడాది కాలంగా వీరిద్దరినీ జట్టు మేనేజ్మెంట్ కొంతవరకు పక్కన పెట్టినప్పటికీ, ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో అనుభవం ఉన్న వీరివైపే పీసీబీ మొగ్గు చూపుతోందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Gold and Silver Prices: ఇరాన్-ఇజ్రాయెల్ పోరుతో కొండెక్కుతున్న బంగారం, వెండి ధరలు!
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!