Site icon NTV Telugu

IndvsPak: అవును.. భారత్‌తో మ్యాచ్ ఉంది.. అయితే ఏంటీ..?

Babar Azam

Babar Azam

భారత్ లో జరుగనున్న వన్డే వరల్డ్ కప్ లో ఉత్కంఠభరితమైన మ్యాచ్ ఏదైన ఉందంటే అది ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ మాత్రమే అని ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు చెబుతారు. ఎందుకంటే దాయాది దేశంపై ఇప్పటి వరకు మనకు మంచి ట్రాక్ రికార్డ్ ఉందనే చెప్పాలి. అయితే ఈ వరల్డ్ కప్ లో జరిగే మ్యాచ్ పై పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజాంను అక్కడి మీడియా ప్రశ్నించింది. దీనిపై అతడు రియాక్ట్ అవుతూ.. అవును.. భారత్‌తో మ్యాచ్ ఉంది.. అయితే ఏంటీ? అని అన్నాడు.

Read Also: Viral News: శరీరంపై 800 టాటూలు.. కనీసం టాయిలెట్ క్లీన్ చేసే పని దొరకట్లేదు..!

అయితే.. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పాక్ సారథి బాబర్ అజాం.. భారత్ తో జరిగే మ్యాచ్ కోసం తామేం ఆత్రుతగా ఎదురుచూడడం లేదని అతడు చెప్పాడు. తాము ఆడే తొమ్మిది మ్యాచుల్లో టీమిండియాతో ఆడే మ్యాచ్ కూడా ఒకటని.. అన్ని మ్యాచ్ లకూ సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని బాబర్ అన్నాడు. తాము ప్రపంచ కప్ ఆడేందుకు ఇండియాకు వెళ్తున్నామని, అంతేతప్ప, కేవలం భారత్ తో ఆడేందుకు కాదని చెప్పాడు. టీమిండియా కాకుండా మరో ఎనిమిది జట్లతోనూ తాము పోటీ పడి గెలవాల్సి ఉందని బాబర్ తెలిపాడు. అన్ని జట్లపై ఆధిక్యత సాధిస్తేనే ఫైనల్ కు చేరుకుంటామని అతడు వ్యాఖ్యానించాడు.

Read Also: Kevin Spacey: థియేటర్‌లో అభిమానిది ‘అది’ పట్టుకున్న హీరో.. అచ్చం కోబ్రాలాగే ఉందంటూ..

కేవలం భారత్ తో జరిగే మ్యాచ్ పైనే కాకుండా అన్ని జట్లపైనా దృష్టి సారించామని పాక్ సారథి అన్నాడు. అన్ని జట్లపైనా బాగా ఆడి, గెలుస్తామని అతను ధీమా వ్యక్తం చేశాడు. ఓ కెప్టెన్ గా తాను ఏ దేశంలో మ్యాచ్ ఆడినా ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం సాధించాలని..అలాగే పాకిస్థాన్ ను గెలిపించాడని కృషి చేస్తానని బాబర్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు కూడా ఇదే విధంగా ఆడతామన్నాడు. అయితే.. భారత్ లో జరుగనున్న వ‌న్డే ప్రపంచకప్ 2023లో భాగంగా అహ్మదాబాద్‌లో అక్టోబరు 15న ఇండియా-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతంది. ఇప్పటికే ఐసీసీ మ్యాచ్ ల వివరాలను ప్రకటించింది. అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌ర్ 19 వ‌ర‌కు ప్రపంచ కప్-2023 జ‌ర‌గ‌నుంది. మొత్తం పది జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి.

Exit mobile version