Pak- Afghan war: పాకిస్థాన్ – ఆఫ్ఘనిస్థన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. పాకిస్థాన్ ఆఫ్ఘనిస్థన్‌లోని తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) పై దాడి ప్రారంభించింది. ఈ దాడి ఇప్పుడు రెండు దేశాలలో అశాంతిని రేకెత్తించింది. ఖైబర్ పఖ్తున్ఖ్వా, బలూచిస్థాన్‌లోని అనేక ప్రాంతాలలో ఆఫ్ఘన్ దళాలు కాల్పులు జరిపాయి. రెండు వైపుల నుంచి ఫిరంగి దాడులు జరిగాయి. ఆఫ్ఘనిస్థన్‌లోని టోలో న్యూస్.. 12 మంది పాకిస్థాన్ సైనికులు మరణించారని చెబుతోంది. కాందహార్‌లోని మైవాండ్ జిల్లాలో ఐదుగురు పాకిస్థాన్ సైనికులు ఇస్లామిక్ ఎమిరేట్ దళాలకు లొంగిపోయినట్లు నివేదిస్తోంది. ఇంతలో, పాకిస్థాన్ మీడియా సంస్థలు మరోసారి అబద్ధాలను వ్యాప్తి చేస్తున్నాయి. పాకిస్థాన్ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంటుండగా.. దాయాది దేశానికి చెందిన దున్యా న్యూస్ అనేక ఆఫ్ఘన్ పోస్టులను నాశనం చేసి, డజన్ల కొద్దీ ఆఫ్ఘన్ సైనికులు మరణించారని పేర్కొంది. అనేక ఆఫ్ఘన్ పోస్టులు పూర్తిగా ధ్వంసమైనట్లు సమాచారం. అనేక ఆఫ్ఘన్ పోస్టులను ఫిరంగి, ట్యాంకులు, వైమానిక దాడులతో లక్ష్యంగా చేసుకున్నట్లు పాకిస్థాన్ మీడియా పేర్కొంది. పాకిస్థాన్ ట్యాంక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఆఫ్ఘన్ వర్గాలు చెబుతున్నాయి.
READ MORE: పాకిస్తాన్–ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో బుల్లెట్ల యుద్ధం..!
సౌదీ అరేబియా, ఖతార్ కలత..
పాకిస్థాన్ -ఆఫ్ఘనిస్థన్ సరిహద్దులో పెరుగుతున్న ఉద్రిక్తతలపై సౌదీ అరేబియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దాని విదేశాంగ మంత్రిత్వ శాఖ, “రెండు దేశాలు సంయమనం పాటించి, చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలి. ఈ ప్రాంతం భద్రత, స్థిరత్వానికి శాంతి చాలా అవసరం” అని పేర్కొంది. ఖతార్ కూడా ఇదే విధంగా స్పందించింది. “ఉద్రిక్తతను తగ్గించడం, సంయమనం పాటించి శాంతి, స్థిరత్వాన్ని కొనసాగించాలి. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ దౌత్యం, సంభాషణల ద్వారా పరిస్థితిని మెరుగు పర్చుకోవాలి.” అని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
