Pak- Afghan war: పాకిస్థాన్ - ఆఫ్ఘనిస్థన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. పాకిస్థాన్ ఆఫ్ఘనిస్థన్‌లోని తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) పై దాడి ప్రారంభించింది. ఈ దాడి ఇప్పుడు రెండు దేశాలలో అశాంతిని రేకెత్తించింది. ఖైబర్ పఖ్తున్ఖ్వా, బలూచిస్థాన్‌లోని అనేక ప్రాంతాలలో ఆఫ్ఘన్ దళాలు కాల్పులు జరిపాయి. రెండు వైపుల నుంచి ఫిరంగి దాడులు జరిగాయి. ఆఫ్ఘనిస్థన్‌లోని టోలో న్యూస్.. 12 మంది పాకిస్థాన్ సైనికులు మరణించారని చెబుతోంది.