Imran Khan: ధిక్కార కేసులో ఇమ్రాన్‌కు షాక్.. అరెస్ట్ వారెంట్ జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Imran Khan: ధిక్కార కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో పాటు ఆయన పార్టీకి చెందిన ఇతర అగ్రనేతలకు పాకిస్థాన్ ఎన్నికల సంఘం బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. పాకిస్తాన్ ఎన్నికల సంఘం, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సికిందర్ సుల్తాన్ రాజాపై పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అగ్రనేతలు జారీ చేసిన ప్రకటనల ఆధారంగా ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నిసార్ దుర్రానీ నేతృత్వంలోని నలుగురు సభ్యుల పాకిస్తాన్ ఎన్నికల సంఘం బెంచ్.. ఇమ్రాన్ ఖాన్, ఆయన సన్నిహితులు ఫవాద్ చౌదరి, అసద్ ఉమర్‌లపై వారెంట్లు జారీ చేసింది.
తమ పక్షపాత విధానమని, పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఎన్నికల కమిషన్‌ను, రాజాను పీటీఐ నేతలు పదే పదే దూషించడంతో ఎన్నికల నిఘా సంస్థ గత ఏడాది ఆగస్టు, సెప్టెంబర్‌లో ధిక్కార అధికారాలను వినియోగించుకుని వారిపై నోటీసులు జారీ చేసింది. మునుపటి విచారణలో ఎన్నికల సంఘం పీటీఐ నాయకులకు తన ముందు హాజరయ్యేందుకు చివరి అవకాశం ఇచ్చింది.
Also Read
- Virat Kohli: మళ్లీ టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ..? జూలై 14 నుంచి మైదానంలోకి కింగ్..
- Sahan: మా బౌలర్లు బెంబేలెత్తిపోయారు.. అది బ్యాటింగ్ అంటారా..? విధ్వంసం: శ్రీలంక కెప్టెన్ సహన్
- Tilak Varma: ఫైనల్లో మేము చేసిన సీక్రెట్ ప్రణాళిక ఇదే.. అందుకే కప్ కొట్టేశాం: తిలక్ వర్మ
- JD Vance: భారతీయ భార్య, పాకిస్తానీ ఆర్మీ చీఫ్.. ఇదేం పోలిక ఉపాధ్యక్షా..
China Warns: జాగ్రత్తగా ఉండండి.. జపాన్‌తో స్నేహంపై ఆస్ట్రేలియాకు చైనా వార్నింగ్
అయితే మంగళవారం విచారణ సందర్భంగా.. కమిషన్ హాజరు నుంచి మినహాయింపు కోసం పీటీఐ నేతలు చేసిన అభ్యర్థనలను బెంచ్ తిరస్కరించింది. బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. విచారణను ధర్మాసనం జనవరి 17కి వాయిదా వేసింది. ఇక, చట్టప్రకారం తటస్థ పాత్రను పోషించడంలో చీఫ్ ఎలక్షన్ కమీషనర్ విఫలమయ్యారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన రాజీనామా చేయాలని కోరుతున్నారు. అయితే తాను చట్ట ప్రకారమే పనిచేస్తున్నానని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చెబుతున్నారు.
తాజావార్తలు
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Virat Kohli: మళ్లీ టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ..? జూలై 14 నుంచి మైదానంలోకి కింగ్..
-
Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
-
Sahan: మా బౌలర్లు బెంబేలెత్తిపోయారు.. అది బ్యాటింగ్ అంటారా..? విధ్వంసం: శ్రీలంక కెప్టెన్ సహన్
-
Cucumber Idli: బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్.. కేవలం నిమిషాల్లో దోసకాయ ఇడ్లీ ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!