Site icon NTV Telugu

Padi Kaushik Reddy : ఉద్యమ కారుడు బాలరాజును చంపించిన వ్యక్తి ఈటల.. కౌశిక్‌రెడ్డి సంచలనం

Padi Kaushik Reddy

Padi Kaushik Reddy

తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు తమ కేడర్‌ను కాపాడుకునే పనిలో పడ్డారు. అంతేకాకుండా.. ప్రజల్లోకి వెళ్లి తమ గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు. అయితే.. ఇప్పటికే అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్రంలో ఆత్మీయ సమ్మేళనాల పేరిట ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిందనే చెప్పాలి. అయితే.. తాజాగా.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌లో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఉన్న శాసనసభ్యునికి మతి పోయిందని, నేరస్థుడైనా సర్పంచ్‌ని కలిసినవ్ కానీ బాధిత మహిళను కనీసం పరామర్శించలేదంటూ ఆయన ఈటలపై విమర్శలు గుప్పించారు.

Also Read :Live-In Relationship: భర్తతో విడాకులు.. డ్రైవర్‌తో సహజీవనం.. కట్ చేస్తే..

నిన్ను ఇంటికి పంపించే రోజులు దగ్గర పడ్డాయని, నిన్నటి ధర్నా కు జనాలు లేక పక్క నియోజకవర్గం నుండి జనాలను తీసుకొచ్చిండు అంటూ ఆయన సెటైర్లు వేశారు. ఉద్యమ కారుడు బాలరాజు ను చంపించిన వ్యక్తి ఈటల అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పేద దళితులని కేసులలో ఇరికించింది ఈటల అని, జై శ్రీరాం అంటావ్ దేవరాంజల్ భూములు లాకున్న వ్యక్తి ఈటల అని ఆయన దుయ్యబట్టారు. కేసీఆర్‌ లేకుంటే ఈరోజు నువెక్కడ ఉండేటోనివి అని ఆయన ప్రశ్నించారు. గుడ్లు ఎరుకొనే వ్యక్తి ని తీసుకొచ్చి మంత్రిని చేసిండు కేసీఆర్‌ అని, హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఇబ్బంది పెడితే ఏ అధికారినైనా నీలాదీస్తా అని ఆయన అన్నారు. జై భీమ్ అంటాడు దళితుల భూములు లాకుంటడు అని ఈటలపై విమర్శలు చేశారు పాడి కౌశిక్‌ రెడ్డి.

Also Read : Sachin Pilot : రాజస్థాన్‌ కాంగ్రెస్‌ లో చల్లారని వేడి.. కీలక సమావేశానికి పైలట్ డుమ్మా

Exit mobile version