Site icon NTV Telugu

Padi Kaushik Reddy: “అప్పటి వరకు అరెస్ట్ చేయొద్దు”.. పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టులో ఊరట..

Mla Padi Kaushik Reddy

Mla Padi Kaushik Reddy

పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది.. సుబేదారి పీఎస్‌లో నమోదైన కేసులో అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. సోమవారం వరకు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశించింది. దర్యాప్తు కొనసాగించొచ్చని, పోలీసులకు సహకరించాలని కౌశిక్ రెడ్డికి సూచించింది.. క్వారీ యజమాని మనోజ్‌ను 50లక్షల ఇవ్వాలంటూ బెదిరించాడని కౌశిక్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. మనోజ్ భార్య ఉమాదేవి ఫిర్యాదు మేరకు సుబేదారి పీఎస్‌లో కేసు నమోదైంది. కేసును కొట్టేయాలంటూ పాడి కౌశిక్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ కక్ష్యల కారణంగానే కేసు నమోదు చేశారని కౌశిక్ రెడ్డి న్యాయవాది కోర్టులో వాదించారు..

READ MORE: TTD: శ్రీవారి దర్శన టికెట్లకు ఫుల్‌ డిమాండ్‌.. నిమిషాల వ్యవధిలోనే కోటా పూర్తి..!

27న ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు ఉన్నాయని న్యాయవాది కోర్టుకు తెలిపారు.. కమలాపూరం మండలం వంగపల్లిలో క్వారీ నిర్వహిస్తున్న మనోజ్.. 2023 అక్టోబర్‌25న 25లక్షల రూపాయలు కౌశిక్‌ రెడ్డికి మనోజ్ చెల్లించినట్లు వాంగ్మూలం ఉంది కదా అని పీపీని హైకోర్టు ప్రశ్నించింది.. బెదిరించడంతో రూ. 25లక్షలను కౌశిక్ రెడ్డికి మనోజ్ చెల్లించాడని పీపీ స్పష్టం చేశారు. ఇప్పుడు రూ. 50లక్షలు ఇవ్వాలని బెదిరించడంతో పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. 2023లో ఎందుకు ఫిర్యాదు చేయలేదని పీపీని హైకోర్టు ప్రశ్నించింది. కౌశిక్‌ రెడ్డిని తదుపరి విచారణ వరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశిస్తూ 28వ తేదీకి విచారణ వాయిదా వేసింది.

READ MORE: Delhi: సాయంత్రం 6గంటలకు అఖిలపక్ష భేటీ.. భవిష్యత్ కార్యాచరణపై చర్చ

Exit mobile version