టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ తమిళిసైపై విమర్శలు చేశారు. తాజాగా ఆయన కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన ఫైళ్ళను గవర్నర్ ఎక్కడ పెట్టుకుందని, ఒక్క ఫైల్ కూడా కదలనివ్వడం లేదన్నారు. అంతేకాకుండా.. హుజురాబాద్ నియోజక అభివృద్ది కోసం ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తట్టెడు మట్టి పోయలేదని ఆయన ఆరోపించారు. ఈటలను టీవీల్లో చూడాలని చెబుతున్నాడని, ఆయన ఏమన్నా ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ అనుకుంటున్నాడో చెప్పాలన్నారు. మాజీ ఎంపీ వివేక్ దగ్గర రూ.40 లక్షల నుండి వంద కోట్లు తీసుకోని హుజురాబాద్ లో ఖర్చు పెట్టామని ఈటల అన్నాడని, ఆ డబ్బులు ఏమయ్యాయనే విషయంపై ఐటీ, ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు కౌశిక్ రెడ్డి.
Also Read : Shahrukh Khan: లేడీ గెటప్‌లో షారుఖ్.. స్ట్రాంగ్ కౌంటరిచ్చిన కింగ్ ఖాన్
అప్పటి ఎన్నికల్లో కేసీఆర్‌నీ వెంట ఉంటే గెలిచావని, ఇప్పుడు నా వెంట కేసీఆర్ ఉన్నాడు. వచ్చే ఎన్నికల్లో చూసుకుందామని ఈటలకు కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. నేను ఓడిపోతే నా ముక్కు నేలకు రాస్తానని, 24గంటల విద్యుత్ సరఫరా చేయడం లేదని ఈటల ఆన్నారని, హుజురాబాద్ నియోజకవర్గంలోని ఏ మండలంలో అయిన చర్చకు నేను సిద్దంగా ఉన్నానన్నారు కౌశిక్ రెడ్డి.