Site icon NTV Telugu

OYO: అయోధ్య, తిరుపతి వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలలో ఓయో ప్రాపర్టీలు..

Oyo

Oyo

ఈ ఏడాది చివరి నాటికి అయోధ్య, వారణాసి, తిరుపతి, కత్రా-వైష్ణో దేవి వంటి ప్రధాన ఆధ్యాత్మిక ప్రదేశాలలో 400 ప్రాపర్టీలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు హాస్పిటాలిటీ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ ఓయో తెలిపింది. ఆధ్యాత్మిక పర్యాటకంపై ప్రజల్లో పెరుగుతున్న నేపథ్యంలో ఏడాది చివరి నాటికి విస్తరణను చేపట్టనున్నట్లు ఓయో ఓ ప్రకటనలో పేర్కొంది.

Ayodhya: అయోధ్యలో ఆలయ నిర్మాణంతో మారనున్న నగర చిత్రపటం.. పెట్టుబడులు పెట్టేందుకు..!

ఈ నేపథ్యంలో ఉత్పన్నమయ్యే వ్యాపార అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి.. అయోధ్య, పూరి, షిర్డీ, వారణాసి, అమృత్‌సర్, తిరుపతి, హరిద్వార్, కత్రా-వైష్ణో దేవి, చార్ ధామ్ మార్గ్‌తో సహా వివిధ మతపరమైన ప్రదేశాలలో ఆస్తులను తెరవాలని ఓయో యోచిస్తోంది. జనవరి 22న గ్రాండ్‌ రామ్‌ టెంపుల్‌ ప్రారంభోత్సవం సందర్భంగా.. అయోధ్య గురించి ఆరా తీసే వారి సంఖ్య గతేడాదితో పోలిస్తే 350 శాతం పెరిగాయని ఓయో తెలిపింది.

IT Employees Layoffs 2024 : 2024లో 50 వేల మంది ఉద్యోగులను తొలగించిన టాప్ 4 కంపెనీలు..

కాగా.. అయోధ్యలో పెరుగుతున్న భక్తుల దృష్ట్యా, ఓయో సుమారు 1,000 గదులు కలిగిన 50 హోమ్‌స్టేలను ప్రారంభించింది. ఓయో వ్యవస్థాపకుడు, గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) రితేష్ అగర్వాల్ మాట్లాడుతూ, “భారతదేశంలో ఆధ్యాత్మిక పర్యాటకం పెద్ద ఎత్తుకు వెళ్లబోతోంది. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవమే ఇందుకు నిదర్శనం. ఈ గ్రాండ్ వేడుకకు హాజరవడం ద్వారా ఈ ఉత్కంఠకు ప్రత్యక్ష సాక్షిని అవుతాను” అని అన్నారు.

Exit mobile version