Assembly Election 2023: ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్-ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ వెలుపల కూడా తమ పార్టీని విస్తరించడంలో నిమగ్నమయ్యారు. ఇందుకు ప్రయత్నాలు విస్తృతంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లోనూ సభలు, సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎంఐఎం పార్టీ బరిలో నిలుస్తుందంటూ సూచనలు చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో తమకు బలం ఉందని భావిస్తున్న ప్రాంతాల్లో అభ్యర్థులను నిలుపుతూ కొన్నిచోట్ల విజయాలనే సొంతం చేసుకుంటుంది. తాజాగా అసదుద్దీన్ ఒవైసీ.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించారు. కర్ణాటకలో 100 స్థానాల్లో ఎంఐఎం పోటీ చేస్తుందని అసదుద్దీన్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.
Read Also: Viral Video: స్టంట్ అదిరింది.. కాకపోతే కారు అద్దం పగిలింది
మరో రెండు, మూడు నెలల్లో కర్ణాటకలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికల షెడ్యూల్ వెలువడకపోయినప్పటికీ.. ప్రధాన రాజకీయా పార్టీలు కొంతకాలంగా జనం మధ్య ఉంటూ ప్రచారాన్ని సాగిస్తున్నాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చిన ఎదుర్కొనేందుకు సిద్దం అయ్యాయి. అభ్యర్థుల ఎంపికపై కూడా పార్టీలు దృష్టి సారించాయి. అయితే కర్ణాటక ఎన్నికల బరిలో నిలవాలనే నిర్ణయంతో ఉన్న అసదుద్దీన్ ఒవైసీ కూడా.. ముందుగానే తమ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. కర్ణాటకలోని మూడు అసెంబ్లీ స్థానాలలో ఎంఐఎం నుంచి బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.
Read Also: Oxygen Plant Blast : ‘బంగ్లా’లోని ఆక్సీజన్ ప్లాంట్లో భారీ పేలుడు.. మృతులను లెక్కిస్తున్న రెస్క్యూ
త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాలో ముగ్గురి పేర్లను ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్-ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆదివారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. బెలగావి నార్త్ నియోజకవర్గం నుండి లతీఫ్ ఖాన్ పఠాన్ , హుబ్లీ ధద్వాడ్ తూర్పు నుండి దుర్గప్ప బిజావాడ్ పోటీ చేయనున్నారు. రాబోయే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు AIMIM అధ్యక్షుడు ప్రకటించిన మూడవ అభ్యర్థి బసవన భాగేవాడి నియోజకవర్గం నుండి అల్లాబక్ష్ బీజాపూర్ బరిలో నిలవనున్నారు.