ఎంఐఎం చీఫ్ అసుదుద్దీన్ ఓవైసీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జరిగే ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు మరియు హుజురాబాద్ ఉప ఎన్నికల్లోనూ.. బీజేపీ పార్టీకి ఓటమి తప్పదని స్పష్టం చేశారు ఓవైసీ. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ మొత్తం 100 స్థానాల్లో పోటీ… చేయనుందని.. ఓవైసీ తెలిపారు. యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడమే తమ లక్ష్యమన్నారు.
ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కూడా అసదుద్దీన్ ఓవైసీ.. కామెంట్ చేశారు. బీజేపీ పార్టీ విభజన రాజకీయాలను దేశ వ్యాప్తంగా ప్రజలంతా చాలా దగ్గరి నుంచి గమనిస్తున్నారని పేర్కొన్నారు. దేశం లోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలను వేధింపులకు గురిచేస్తున్నారని ఫైర్ అయ్యారు. కాగా.. ఇవాళ ఉదయం 7 గంటల ప్రాంతంలో హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నిక ప్రారంభం అయిన సంగతి తెలిసిందే.