Corona: యూకేలో కరోనా విజృంభణ.. అక్టోబర్‌లో 2 మిలియన్ల మందికి కొవిడ్ పాజిటివ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Corona: గతంలో గడగడలాడించిన కరోనా మహమ్మారి ఇంకా ప్రపంచాన్ని పట్టి పీడిస్తూనే ఉంది. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్న నేపథ్యంలో కొత్త కొత్త వేరియంట్లు మళ్లీ భయాందోళనను కలిగిస్తున్నాయి. బ్రిటన్‌లో కరోనా మహమ్మారి మళ్లీ తన ప్రతాపాన్ని చూపుతోంది. గత కొన్ని రోజులుగా అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఒక్క అక్టోబర్ నెలలోనే యూకేలో 20 లక్షల మంది కొవిడ్ బారిన పడినట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌లోని ప్రతి 30 మందిలో ఒకరికి కొవిడ్ ఉన్నట్లు ది గార్డియన్ నివేదించింది. గడిచిన ఒక్క వారంలోనే యూకేలో 1,706,200 మంది కొవిడ్ బారిన పడ్డారని ఈ నివేదిక సూచించింది.
Also Read
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
- AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
‘ఇంగ్లాండ్ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది.’ అని కోవిడ్-19 సర్వే చేపట్టిన సంస్థ డిప్యూటీ డైరెక్టర్ సారా క్రాఫ్ట్ ‘ది గార్డియన్’తో అన్నారు. ముందు ముందు మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రులు, యూకే ఆరోగ్య విభాగం విడుదల చేసిన నివేదిక ప్రకారం అక్టోబర్ 10తో ముగిసిన వారంలో 8,198 మంది ఆసుపత్రుల్లో చేరారు. అక్టోబర్ 17 వరకు 7,809 మంది చేరినట్లు తెలిసింది. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఈ నెల చివరి నాటికి మరింత విజృంభించే ప్రమాదం ఉన్నట్లు ఆరోగ్య శాఖ హెచ్చరించింది. బీఏ.5 పరివర్తనం చెంది ఒమిక్రాన్ బీక్యూ1.1 అనే కొత్త వేరియంట్ ఉద్భవించింది. ప్రస్తుతం బీక్యూ1.1 వేరియంట్ రోగనిరోధక శక్తి కళ్లుగప్పి వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 300లకుపైగా ఒమిక్రాన్ సబ్‌వేరియంట్లు గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అవన్నీ రోగనిరోధక శక్తి కళ్లుగప్పే విధంగా వ్యాప్తి చెందుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.
తాజావార్తలు
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
-
Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
-
Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
-
Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
-
Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!