Prashant Kishor: నితీష్‌కుమార్‌కు ప్రశాంత్ కిషోర్ సవాల్.. నిజంగా బీజేపీతో సంబంధం లేకుంటే ఆ పని చెయ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prashant Kishor: బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ బీజేపీతో ఇంకా టచ్‌లో ఉన్నారని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్ ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన ఈ అంశంపై వ్యాఖ్యానించారు. ఒకప్పుడు జేడీయూలో మిత్రులుగా ఉన్న వీరిద్దరు ప్రస్తుతం బద్ధశత్రువులుగా మారిపోయారు. నితీష్ మహాఘట్‌బంధన్‌లో చేరినప్పటికీ ఇంకా బీజేపీతో టచ్‌లో ఉన్నారని పీకే ఆరోపిస్తున్నారు. తాజాగా మరో సవాల్ విసిరారు ప్రశాంత్ కిషోర్. ఒకవేళ నితీష్ కుమార్ బీజేపీతో కలిసి లేకుంటే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్‌ను తన పదవికి రాజీనామా చేయాల్సిందిగా కోరాలని సవాల్ విసిరారు. జేడీయూ ఎంపీ అయిన హరివంశ్ ప్రస్తుతం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఎన్డీఏ నుంచి జేడీయూ వైదొలగినప్పుడు ఆ పదవి నుంచి మాత్రం ఎందుకు తప్పుకోలేదని ప్రశ్నించారు. అన్ని సమయాల్లో రెండు మార్గాలు ఉండవు నితీష్ జీ అంటూ ప్రశాంత్ కిషోర్ సైటైర్లు వేశారు.
Jacqueline Fernandez: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మధ్యంతర బెయిల్ పొడిగింపు
Also Read
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
నితీష్‌కుమార్ మహాఘట్‌బంధన్‌లో ఉన్నప్పటికీ బీజేపీకి తలుపులు తెరిచే ఉంచారని అందుకు రాజ్యసభ ఛైర్మన్ పదవే నిదర్శనమని పీకే అన్నారు. 2024లో ఎన్డీఏ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేస్తామన్న నితీష్ మాటలను నమ్మలేమన్నారు. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్న 17 ఏళ్లలో 14 ఏళ్లు బీజేపీ మద్దతుతోనే ఆ పదవిలో కొనసాగారని ప్రశాంత్ కిషోర్ ఎత్తిచూపారు. బీహార్‌లో మహాఘటబంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తేజస్వి యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్‌తో చేతులు కలపడానికి నితీష్ కుమార్ ఈ ఏడాది ఆగస్టులో బీజేపీని రెండోసారి వదులుకున్నారు.
తాజావార్తలు
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..