Opposition Alliance: రాబోయే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య ఫ్రంట్‌ను రూపొందించే ప్రయత్నంలో 26 పార్టీల నాయకులు రెండో రోజు సమావేశమయ్యారు. కాంగ్రెస్‌కు అధికారంపైనా, ప్రధాని పదవిపైనా ఆసక్తి లేదని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమావేశంలో అన్నారు. “ఈ సమావేశంలో మా ఉద్దేశం అధికారం సంపాదించుకోవడం కాదు. ఇది మన రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయాన్ని రక్షించడం” అని కాంగ్రెస్ చీఫ్ అన్నారు. సోమవారం జరిగిన విందు సమావేశానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రులు ఎంకే స్టాలిన్, నితీశ్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ హాజరయ్యారు.
Also Read: Brijbhushan: లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్‌భూషణ్‌కు మధ్యంతర బెయిల్.. ఈ నెల 20న మళ్లీ విచారణ
విపక్ష నేతల నినాదం “యునైటెడ్ వి స్టాండ్”, ఈ సమావేశం భారత రాజకీయ దృష్టాంతంలో “గేమ్ ఛేంజర్” అని ప్రతిపక్ష నాయకులు నొక్కి చెప్పారు. ప్రతిపక్షాల సమావేశం జూలై 18న ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఎన్‌డీఏ సమావేశంతో సమానంగా ఉంది. ఇన్నేళ్ల ఎన్నడూ లేని విధంగా విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. మోడీకి ధీటైన నేతను ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టాలని భావిస్తున్నాయి. పరిస్థితులను బట్టి కొన్ని కొత్త మిత్రపక్షాలు అధికార బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణంలో చేరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: Heavy Rains Alert: పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. గంగోత్రి-యమునోత్రి నేషనల్ హైవే మూత
కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష కూటమికి ఇప్పటివరకు యూపీఏ(యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయెన్స్)గా ఉండేది. ఇప్పుడు ఈ విపక్ష కూటమికి అదే పేరు ఉంటుందా లేక మారుస్తారా అని చర్చ జరుగుతోంది. దీనికి చెక్ పెడుతూ ఈ కూటమికి మరో పేరు పెట్టారు. బెంగళూరులో పలు పార్టీలు పాల్గొన్న సభలో విపక్ష కూటమికి ‘INDIA'(Indian National Democratic Inclusive Alliance) అని పేరు పెట్టారు. దీనికి నేతలంతా ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తోంది. ఇక మీదట ఈ విపక్ష కూటమిని ‘INDIA’గా పిలవనున్నారు. అయితే ఈ కూటమికి ఎవరు సారథ్యం వహిస్తారనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీనే ఈ కూటమికి చీఫ్‌గా వ్యవహరిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.