Oppo Reno 14 Pro 5G: మోస్ట్ అవైటెడ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసిందోచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
- ఫ్లాగ్ షిప్ స్మార్ట్‌ఫోన్ Reno 14 Pro 5G భారత్‌లో విడుదల
- ట్రిపుల్ 50MP కాంబినేషన్
- 6.83 అంగుళాల LTPS OLED డిస్ప్లే
- ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు
- IP66, IP68, IP69 రేటింగ్ ధూళి, నీటి నిరోధకత
- 6200mAh భారీ బ్యాటరీ, 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్, 50W AirVOOC వైర్‌లెస్ ఛార్జింగ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oppo Reno 14 Pro 5G: ఒప్పో కంపెనీ తన మోస్ట్ అవైటెడ్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్‌ఫోన్ Reno 14 Pro 5Gను భారత్‌లో విడుదల చేసింది. దీంతోపాటు బేస్ వేరియంట్ అయిన Oppo Reno 14 5G కూడా మార్కెట్లోకి వచ్చేసింది. చైనా మార్కెట్ లో ఇదివరకే విడుదలైన ఈ మోడల్స్ ఇప్పుడు భారతీయ వినియోగదారులకు కూడా అందుబాటులోకి వచ్చింది. అబ్బురపరిచే స్పెసిఫికేషన్లు, పవర్ ఫుల్ కెమెరా సెటప్, భారీ బ్యాటరీ సామర్థ్యం ఈ ఫోన్ ప్రత్యేకతలను ఓ సారి చూసేద్దామా..
ప్రాసెసర్:
ఈ కొత్త Reno 14 Pro 5Gలో 4nm MediaTek Dimensity 8450 ప్రాసెసర్ ఉంది. AI ఆధారిత ఫీచర్లు, Google Gemini సపోర్ట్ ఉన్నాయి. అలాగే ఈ ప్రో వేరియంట్ 12GB RAM + 256GB / 512GB స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది.
Also Read
- 150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
- Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- Bus Fire Accident: మీర్పేట్లో బస్సులో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
Read Also:OPPO Reno 14: 6200mAh భారీ బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరా, అద్భుత AI ఫీచర్లతో వచ్చేసిన ఒప్పో రెనో 14..!

కెమెరా:
ఇందులో ట్రిపుల్ 50MP కాంబినేషన్ ఉంది. ఈ ప్రొ మోడల్‌లో 50MP ప్రైమరీ సెన్సార్ (OIS) తోపాటు 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ (3.5X ఆప్టికల్ జూమ్, OIS సపోర్ట్), 50MP అల్ట్రా వైడ్ కెమెరా, సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా (4K HDR వీడియో రికార్డింగ్ సపోర్ట్) ఉన్నాయి.

బ్యాటరీ, ఛార్జింగ్:
Reno 14 Pro 5Gలో 6200mAh భారీ బ్యాటరీ ఉంది. దీనికి 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్, 50W AirVOOC వైర్‌లెస్ ఛార్జింగ్ అందించబడుతుంది.

డిస్‌ప్లే, డిజైన్:
ఈ Reno 14 Pro 5Gలో 6.83 అంగుళాల LTPS OLED డిస్ప్లే ఉంది. ఇది 1.5K రెజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ ను అందిస్తుంది. అలాగే 1,200 నిట్స్ బ్రైట్‌నెస్, Corning Gorilla Glass 7i రక్షణ లభిస్తుంది. అంతేకూండా స్ప్లాష్, గ్లోవ్ టచ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది.
ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. అలాగే ఫోన్‌కి IP66, IP68, IP69 రేటింగ్ ధూళి, నీటి నిరోధకతలను కలిగి ఉన్నాయి. వీటితోపాటు AI Unblur, AI Recompose, AI Call Assistant, AI Mind Space, Live Photo Export వంటి అధునూతన AI ఫీచర్లు కూడా ఉన్నాయి.

ధర:
Oppo Reno 14 Pro 5G రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభ్యమవుతుండగా.. ఇందులో బేస్ వేరియంట్ 12GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 49,999గా నిర్ణయించారు. అలాగే హైఎండ్ వేరియంట్ 12GB RAM + 512GB స్టోరేజ్ మోడల్ ధరను రూ. 54,999గా నిర్ణయించారు. ఈ మొబైల్స్ పెర్ల్ వైట్ (Pearl White), టైటానియం గ్రే (Titanium Grey) అనే రెండు రంగుల ఆప్షన్లలో అందిస్తున్నారు. ఈ మొబైల్స్ జూలై 8 నుంచి Oppo India వెబ్‌సైట్, అమెజాన్ ఇంకా ఆఫ్‌లైన్ స్టోర్స్లో అందుబాటులో ఉంటాయి.
తాజావార్తలు
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!
-
Vivo Y600i: వివో Y600i లిస్టింగ్.. 6.87 అంగుళాల డిస్ప్లే, 8,000mAh బ్యాటరీ!
-
India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
-
Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
ట్రెండింగ్
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్‌షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!