మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్ర లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’. తెలుగు మరియు హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా వరుణ్ తేజ్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.శక్తిప్రతాప్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. ప్రేక్షకుల వద్ద నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ మూవీ నుంచి కొన్నాళ్లు గా ఎలాంటి అప్‌డేట్స్ మేకర్స్ ఇవ్వలేదు. ఈ మూవీకి సంబంధించిన కొత్త న్యూస్ ఎప్పుడొస్తుందా అని వరుణ్ తేజ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ నుంచి మేకర్స్ ఒక సాలిడ్ అప్‌డేట్ ను ఇచ్చారు.
ఈ మూవీ నుంచి ఫస్ట్ స్ట్రైక్ రేపు ఉదయం 11.05 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఇక ఫస్ట్ ఎయిర్ స్ట్రైక్ టీజర్ అయ్యిండొచ్చని మూవీ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మరియు రినైసన్స్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.. భారతదేశం ఎదుర్కొన్న అతిపెద్ద వైమానిక దాడుల నేపథ్యంలో యథార్థ సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమా రూపొందింది.అయితే మొదట ఈ మూవీని డిసెంబర్ 08 న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అనుకోని కారణాల వల్ల ఈ సినిమాని మేకర్స్ వాయిదా వేశారు.. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా ను 2024 ఫిబ్రవరి 16 న తెలుగు మరియు హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రం లో వరుణ్ తేజ్ ఫైటర్ పైలట్‌గా నటిస్తున్నారు. అలాగే హీరోయిన్ మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తుంది.
The battlefield is about to witness one of the biggest Airstrikes!#OperationValentine First Strike TOMORROW at 11:05 AM 💥
Stay Tuned! @IAmVarunTej @ShaktipsHada89 @ManushiChhillar @iRuhaniSharma @ShatafFigar #PareshpAhuja @sidhu_mudda @nandu_abbineni @sonypicsfilmsin… pic.twitter.com/rAI8krvIY5
— Vamsi Kaka (@vamsikaka) December 17, 2023