Site icon NTV Telugu

Operations Sindoor : పాక్ పరువు పోయింది.. మేం ఏం చేయలేం అంటూ వీడియోలు

Pak

Pak

Operations Sindoor : భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ దాడులు పాకిస్తాన్‌లోని సాధారణ పౌరుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నాయి. తమ దేశ రక్షణ వ్యవస్థ బలహీనతను ఎత్తిచూపుతూ, భారత్ విజయవంతమైన దాడులను వారు నిస్సహాయంగా చూస్తూ ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ పాకిస్తానీ పౌరుడు మాట్లాడుతూ, “భారత్ అనుకున్న లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తిచేసింది. మా రక్షణ వ్యవస్థ ఒక్క మిస్సైల్‌ను కూడా అడ్డుకోలేకపోయింది. ఏకంగా 24 మిస్సైల్స్‌ను వారు ప్రయోగించినా, వాటిలో ఒక్కదాన్ని కూడా మా సైన్యం నిలువరించలేకపోయింది. మా దేశం ఏ మాత్రం ప్రతిస్పందించలేకపోయింది” అని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భారతదేశం ఉగ్రవాదుల శిబిరాలపైనే దాడి చేసిందని, ఉగ్రవాదులే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని ఆయన స్పష్టం చేశారు.

CM Revanth Reddy : భారత సైన్యానికి మద్దతుగా నేడు సంఘీభావ ర్యాలీ

“పాక్‌ స్థావరాలపై దాడి చేసిన తర్వాత మేం చేసేది ఏమీ లేదు. మా బలహీనతను ప్రపంచం ముందు భారత్ చాటి చెప్పింది” అని ఆయన ఆవేదన చెందారు. దేశంలోని కొందరు వ్యక్తులు, ముఖ్యంగా సోషల్ మీడియాలో, భారత యుద్ధ విమానాలను కూల్చేశామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. “వాస్తవానికి జరిగింది వేరు. మా అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్నారు” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ, ఈ దాడులను అడ్డుకోవడంలో పాకిస్తాన్ వైఫల్యం అక్కడి ప్రజల్లో తీవ్ర నిరాశను, ఆగ్రహాన్ని కలిగిస్తోంది. తమ దేశ రక్షణ వ్యవస్థపై నమ్మకం కోల్పోతున్నామని, భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాలు పాకిస్తాన్‌ అంతర్గత రాజకీయ పరిస్థితులను మరింత అస్థిరపరిచే అవకాశం ఉంది.

Guntur Crime: ట్రాంజెండర్‌తో ఎఫైర్..! తప్పు అని చెప్పినందుకు దారుణ హత్య..

Exit mobile version