Operations Sindoor : భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ దాడులు పాకిస్తాన్‌లోని సాధారణ పౌరుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నాయి. తమ దేశ రక్షణ వ్యవస్థ బలహీనతను ఎత్తిచూపుతూ, భారత్ విజయవంతమైన దాడులను వారు నిస్సహాయంగా చూస్తూ ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ పాకిస్తానీ పౌరుడు మాట్లాడుతూ, “భారత్ అనుకున్న లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తిచేసింది. మా రక్షణ వ్యవస్థ ఒక్క మిస్సైల్‌ను కూడా అడ్డుకోలేకపోయింది. ఏకంగా 24 మిస్సైల్స్‌ను వారు ప్రయోగించినా,…