Rajnath Singh: ‘ఆపరేషన్ సిందూర్’ సక్సెస్ కావడానికి కారణం అదే.. రాజ్‌నాథ్‌సింగ్ కీలక వ్యాఖ్యలు
- ఆపరేషన్ సిందూర్ విజయం ప్రశంసనీయం
- సాయుధ దళాలు పరాక్రమాన్ని అభినందిస్తున్న
- ప్రపంచం మొత్తం భారతదేశం ధైర్యాన్ని చూసింది
- ఈ దాడిలో అమాయకులు చనిపోలేదు
- రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆపరేషన్ సిందూర్ విజయం ప్రశంసనీయమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మన సాయుధ దళాలు నిన్న తీసుకున్న చర్యకు, వారు ప్రదర్శించిన ధైర్యం, పరాక్రమాన్ని తాను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఓ కార్యక్రమంలో మాట్లాడిన రక్షణ మంత్రి పాకిస్థాన్, పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలను మన దళాలు ధ్వంసం చేసిన విధానం మనందరికీ గర్వకారణమన్నారు. ‘ఆపరేషన్ సిందూర్’ ఖచ్చితత్వంతో నిర్వహించారన్నారు. ఈ ఆపరేషన్‌లో 9 ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయని.. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు మరణించారని స్పష్టం చేశారు. ఇందులో ఏ అమాయకుడు కూడా చనిపోలేదని రాజ్‌నాథ్‌సింగ్ పునరుద్ఘాటించారు. మన దళాల వద్ద అద్భుతమైన ఆయుధాలు ఉండటం వల్ల ఇది సాధ్యమైందన్నారు. నిన్న ప్రపంచం మొత్తం భారతదేశం ధైర్యాన్ని చూసిందన్నారు. భారత్ తనను తాను రక్షించుకోవడానికి దాడులు చేసింది. మన సైన్యం అంత్యంత తెగువ చూపిందని కొనియాడారు.
READ MORE: Operation Sindoor: “అంతా సిద్ధం” ప్రభుత్వ కార్యదర్శులతో ప్రధాని ఉన్నతస్థాయి సమావేశం..
Also Read
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
- Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
- CM Chandrababu Prakasam District Visit: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
- Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
అంతకు ముందు.. ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగించారు. ఈ ‘ఆపరేషన్ సిందూర్ లో కనీసం 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ఈ మేరకు ఆపరేషన్ వివరాలను గురువారం ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష భేటీలో వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. పహల్గాంలో అమాయక పౌరులను పొట్టనబెట్టుకున్న ఉగ్రమూకలపై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోన్న పాకిస్థాన్‌కు గట్టిగా బదులు చెప్పింది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులతో విరుచుకుపడింది.
తాజావార్తలు
-
TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
-
Red Magic 12 Pro+: 8,400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+.. RGB లిక్విడ్ కూలింగ్‌తో కొత్త గేమింగ్ ఫోన్!
-
IND vs WI 2nd T20: నేడు భారత్, వెస్టిండీస్ రెండో టీ20.. పిచ్ రిపోర్ట్, వాతావరణం, ప్లేయింగ్ 11 ఇదే!
-
Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
-
NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!